Share News

AP Politics: షరామామూలే.. మళ్లీ టీడీపీ-జనసేన బహిరంగ సభకు అడ్డంకులు

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:36 AM

Andhrapradesh: టీడీపీ ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా అడ్డంకులు సృష్టించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిపోయినట్లు అనిపిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారనేది చెప్పనక్కర్లేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ సభలు నిర్వహించినా ఏదో ఒక రూపంలో అడ్డుకోవడం అనేది జరుగుతూనే ఉంది.

AP Politics: షరామామూలే.. మళ్లీ టీడీపీ-జనసేన బహిరంగ సభకు అడ్డంకులు

పశ్చిమగోదావరి, జనవరి 4: టీడీపీ ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా అడ్డంకులు సృష్టించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిపోయినట్లు అనిపిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారనేది చెప్పనక్కర్లేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఎక్కడ సభలు నిర్వహించినా ఏదో ఒక రూపంలో అడ్డుకోవడం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంటలో ఈనెల 7న టీడీపీ-జనసేన (TDP-Janasena) బహిరంగ సభకు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే టీడీపీ-జనసేన సభకు కూడా అధికార పార్టీ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది.

ఈ క్రమంలో సభకు స్థలం ఇచ్చిన లే అవుట్ యజమానిని ఒక ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరించినట్లు తెలుస్తోంది. ‘‘స్థలం ఎందుకు ఇచ్చావు.. స్థలం ఇచ్చినందుకు కేసులు పెట్టి, పెనాల్టీ వేస్తామంటూ’’ హెచ్చరించినట్లు సమాచారం. పైగా విజిలెన్స్ అధికారులను సైతం సదరు ముఖ్య ప్రజాప్రతినిధి రంగంలోకి దిపాడు. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ యజమాని .. టీడీపీ నేతల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాడు. దీంతో విజిలెన్స్ అధికారులతో టీడీపీ నేతలు చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. అధికార పార్టీ తీరుపై టీడీపీ- జనసేన నేతలు మండిపడుతున్నారు.


చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు...

కాగా 7న ఆచంటలో జరిగే చంద్రబాబు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లకు అదనంగా అబ్జర్వర్లను, టూర్‌ కో ఆర్డినేటర్‌, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటించారు. ఆచంట ఇన్‌చార్జ్‌ పితాని సత్యనారాయణ, అబ్జర్వర్‌గా గన్ని వీరాంజనేయులు, పాలకొల్లుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కేఎస్‌ జవహర్‌, నరసాపురానికి పొత్తూరి రామరాజు, బొడ్డు వెంకటరమణచౌదరి, భీమవరానికి తోట సీతారామలక్ష్మి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండికి ఎమ్మెల్యే మంతెన రామరాజు, దాట్ల సుబ్బరాజు, తణుకుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, బండారు సత్యానందరావు, తాడేపల్లిగూడెంకు వలవల బాబ్జి, బడేటి రాధాకృష్ణయ్య ఉన్నారు.

మాజీ మంత్రి పితాని ఆధ్వర్యంలో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు స్థలాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, గొడవర్తి శ్రీరాములు, గణపతినీడి రాంబాబు, చిలుకూరి సీతారామ్‌, బీకే, కేతా మురళి తదితరులున్నారు. చంద్రబాబు సభ జరగకుండా అడ్డుకునేందుకు ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాధరాజు ప్రయత్నించడం దారుణమని ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు అన్నారు. దీనిని ఖండి స్తున్నట్లు చెప్పారు. రాయలసీమ రాజకీయాలు ఆచంటలో చేయడం తగదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరుగుతుందన్నారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 04 , 2024 | 10:12 AM