Share News

Narendra Modi: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కరెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 30 , 2024 | 02:41 PM

గత 10 సంవత్సరాలలో ఫిన్‌టెక్ రంగంలో 31 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే ఫిన్‌టెక్ స్టార్టప్‌లు 500 శాతం పెరిగాయన్నారు. ఏంజెల్ పన్నును తొలగించడం కూడా ఈ రంగం అభివృద్ధికి ఒక ముందడుగు అని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో కరెన్సీ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Narendra Modi: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కరెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు
PM Modi

ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తెలిపారు. గత 10 సంవత్సరాలలో ఈ రంగంలో 31 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఫిన్‌టెక్ స్టార్టప్‌లు 500 శాతం పెరిగాయన్నారు. ఏంజెల్ పన్నును తొలగించడం కూడా ఈ రంగం అభివృద్ధికి ఒక ముందడుగు అని ప్రధాని అన్నారు. ముంబై(mumbai)లో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ప్రధాని మోదీ పాల్గొన్న క్రమంలో దేశంలోని ఫిన్‌టెక్ విప్లవం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఫిన్‌టెక్ రంగం ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు.


గతంలో బ్యాంకులు లేవని

భారతదేశంలో ఇదివరకు బ్యాంకు శాఖలు లేవని, ప్రతి గ్రామంలో బ్యాంకులు, ఇంటర్నెట్ సౌకర్యం, కరెంటు లేదని పార్లమెంటులో అడిగేవారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఒక దశాబ్దంలోనే భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు దాదాపు 94 కోట్లకు పెరిగారని వెల్లడించారు. 21వ శతాబ్దపు ప్రపంచం వేగంగా మారుతున్నదని, దేశంలో కరెన్సీ నుంచి క్యూఆర్ కోడ్‌కు శతాబ్దాల కాలం పట్టిందన్నారు. అయితే ఇప్పుడు మనం ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలను చూస్తున్నామని ప్రధాని అన్నారు. నేడు డిజిటల్ బ్యాంకులు సహా నియో బ్యాంకింగ్ వంటి అనేక అంశాలు పుట్టుకొస్తున్నాయని మోదీ తెలిపారు. దీంతోపాటు రిస్క్ మేనేజ్‌మెంట్, మోసాన్ని గుర్తించడం నుంచి కస్టమర్ అనుభవం వరకు ప్రతిదీ మారుతోందన్నారు.


27 లక్షల కోట్ల లోన్స్

ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోఫైనాన్స్ పథకం అయిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద రూ. 27 లక్షల కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేసినట్లు ప్రధాని చెప్పారు. నేడు 53 కోట్ల మందికి పైగా జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అంటే 10 ఏళ్లలో మనం సాధించిన ఘనత ఈ విధంగా ఉందన్నారు. మొత్తం యూరోపియన్ యూనియన్‌కు సమానమైన జనాభా బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానించబడిందని ప్రధాని తెలిపారు. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌లు మరో పరివర్తనకు ఊతమిచ్చాయన్నారు.


డిజిటల్ అక్షరాస్యత

సైబర్ మోసాలను నిరోధించేందుకు, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నియంత్రణాధికారులను ప్రధాని ఈ సందర్భంగా కోరారు. భారతీయులకు నాణ్యమైన జీవితాన్ని అందించగల మన ఆర్థిక సాంకేతికత ల్యాండ్‌స్కేప్‌పై నమ్మకం ఉందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, నగరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఆర్థిక సాంకేతికత సహాయపడిందని ప్రధాని వెల్లడించారు. ఒకప్పుడు నగదు రాజ్యమేనని చెప్పుకునేవారు, కానీ నేడు ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం భారత్‌లోనే జరుగుతున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచ భారతదేశ UPI ఫిన్‌టెక్‌కి దీనికి మంచి ఉదాహరణ అని మోదీ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 02:43 PM