Share News

Deepinder Goyal: అంబానీ, అదానీ కాదు.. నిమిషాల్లోనే రూ.1600 కోట్లు సంపాదించిన మరో ఇండియన్

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:11 PM

మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్‌లో కూడా చేరారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Deepinder Goyal: అంబానీ, అదానీ కాదు.. నిమిషాల్లోనే రూ.1600 కోట్లు సంపాదించిన మరో ఇండియన్
Deepinder Goyal

మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే Zomato సహ వ్యవస్థాపకుడు, CEO అయిన దీపిందర్ గోయల్(Deepinder Goyal). ఈ ఫుడ్ డెలివరీ వ్యాపారవేత్త దీపిందర్ ఈరోజు(ఆగస్టు 2న) కొన్ని నిమిషాల్లోనే 1,638.60 కోట్ల రూపాయలను సంపాదించారని చెప్పవచ్చు. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్‌లో కూడా చేరారు. అయితే అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


నష్టాల వేళ కూడా..

నేడు (ఆగస్టు 2న) దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) భారీ నష్టాలు కొనసాగిన వేళ కూడా జోమాటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. అయితే జూన్ 30, 2024 (Q1 FY25)తో ముగిసిన త్రైమాసికంలో (Q1 FY25) నికర లాభం మూడు రెట్లు పెరిగిందని సంస్థ వెల్లడించిన క్రమంలో ఈ స్టాక్ జోరు పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ రికార్డ్ బ్రేకింగ్ లాభాలను ఆర్జించింది. ప్రస్తుత వ్యాపార సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమ లాభం భారీగా పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీకి తెలిపింది. కంపెనీ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు చేరుకుంది. ఆ క్రమంలో కంపెనీ ఏకీకృత ఆదాయాలు ఏటా రూ.2416 కోట్ల నుంచి రూ.4206 కోట్లకు పెరిగాయి. ఈ కారణంగా ఈ రోజు షేర్లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది.


ఒకానొక దశలో

ఆ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒకానొక సమయంలో Zomato షేర్లు 19% వరకు పెరిగాయి. ఆ నేపథ్యంలో బీఎస్‌ఈలో గత ముగింపు రూ.234.10 నుంచి షేర్ ధర రూ.278.45 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (MCAP) విలువ దాదాపు రూ.2.46 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీ తన ఎంక్యాప్‌(MCAP)కు దాదాపు రూ.40,000 కోట్లు పెరగడం విశేషం.

ఈ అద్భుతమైన పెరుగుదల నేపథ్యంలో Zomato CEO దీపిందర్ గోయల్ 4.19% షేర్ల నికర విలువ రూ. 1,638 కోట్లకు పైగా పెరిగింది. జూన్ 30, 2024 నాటికి గోయల్ కంపెనీలో 36,94,71,500 ఈక్విటీ షేర్లను లేదా 4.19 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీని ప్రకారం చూస్తే జొమాటో షేర్లు ఈ రోజులో అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు కంపెనీలో దీపిందర్ గోయల్ వాటా రూ.10,288 కోట్లు పెరిగిందని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కొన్ని గంటల్లోనే 4 లక్షల కోట్లు ఖతం..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 02 , 2024 | 05:13 PM