Share News

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:55 PM

Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్‌తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.

October 2024 Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 11 రోజులు సెలవు..
Bank Holidays

Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్‌తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. హోమ్ లోన్ గానీ, హౌస్ లోన్ గానీ తీసుకోవాలనుకుంటే.. తప్పనిసరిగా బ్యాంకు వద్దకు వెళ్లాల్సివస్తుంది. అలాగే.. అకౌంట్ ఓపెన్ చేసేవారు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసినప్పటికీ.. పాస్ బుక్, చెక్ బుక్, ఏటీఎం కార్డు కావాలంటే తప్పనిసరిగా బ్యాంకు వద్దకు వెళ్లాల్సిందే.

మొత్తంగా ఏ రకంగా చూసినా.. కొన్ని కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకు వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. ఈ సెలవు రోజుల్లో మీకు బ్యాంకు పనులు అత్యవసరమైతే.. ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే.. అక్టోబర్ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ముందుగానే మీ దృష్టికి తీసుకువస్తున్నాం. బ్యాంకింగ్ వర్గాల అధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే..


అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు హాలిడేస్ వచ్చాయి. 2వ తేదీ.. 3, 6, 10, 11, 12, 13, 17, 20, 26, 27, 31 రోజుల్లో సెలవులు ఉండనున్నాయి. మరి ఈ సెలవులు ఎందుకు? కారణాలేంటి అనే వివరాలు కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంటుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీన శారదీయ నవరాత్రులు, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన కూడా బ్యాంక్ హాలిడే ఉంటుంది. అక్టోబర్ 6వ తేదీన ఆదివారం కావడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.


అక్టోబర్ 10వ తేదీన మహా సప్తమి కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మహానవమి కారణంగా అక్టోబర్ 11న కూడా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆయుధపూజ, దసరా, రెండో శనివారం కారణంగా అక్టోబర్ 12న దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులన్నీ బంద్ ఉంటాయి. 17వ తేదీన కాటి బిహు సందర్భంగా అస్సాం రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే, ఈ రోజున వాల్మీకి జయంతి కారణంగా చాలా రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 20వ తేదీ ఆదివారం కారణంగా బంద్ ఉంటాయి.


అక్టోబర్ 26వ తేదీన నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. 27వ తేదీన ఆదివారం కావడంతో ఆ రోజునా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్ధశి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది.


Also Read:

తిరుమల కల్తీలో బయటపడుతున్న కొత్త ట్విస్టులు

కడియం శ్రీహరి నోట ఉపఎన్నిక మాట..

జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ

For More Business News and Telugu News..

Updated Date - Sep 26 , 2024 | 04:00 PM