Share News

Best Investment Tips: ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవి చాలా బెస్ట్..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 07:38 PM

Best Investment Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకుంటున్నారు. అంతేకాదు.. విశ్రాంతి సమయంలో తాము సైతం ప్రశాంతంగా జీవించేందుకు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన ప్లాన్స్ చేస్తుంటారు.

Best Investment Tips: ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవి చాలా బెస్ట్..!
Best Investment Schemes

Best Investment Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకుంటున్నారు. అంతేకాదు.. విశ్రాంతి సమయంలో తాము సైతం ప్రశాంతంగా జీవించేందుకు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన ప్లాన్స్ చేస్తుంటారు. ప్రస్తుత అవసరాలతో పాటు.. భవిష్యత్ అవసరాలను సైతం తీర్చుకునేందుకు పొదుపు చేస్తుంటారు. అయితే, కొందరు రేపటి అవసరాల కోసం పొదుపు చేయాలనుకుంటారు కానీ.. ఎక్కడ పొదుపు చేయాలి? ఎలా పొదుపు చేయాలనేది తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా మీ భవిష్యత్ కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? ఏ ప్లాట్‌ఫామ్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ ప్రత్యేక కథనం..


డబ్బును ఇలా ఆదా చేసుకోండి..

1. మీరు డబ్బును ఆదా చేయాలనుకుంటే, పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏదైనా ప్రభుత్వ పథకంలో ఇన్వె్స్ట్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం రెండూ తమ తమ స్థాయిలలో వివిధ ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. మీరు భవిష్యత్ అవసరాల కోసం వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.

2. మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బుపై మంచి వడ్డీ పొందవచ్చు. తద్వారా భవిష్యత్ అవసరాలను తీర్చుకోవచ్చు.


3. భవిష్యత్ అవసరాల కోసం డబ్బును ఆదా చేసుకోవడానికి మూడో మార్గం బీమా పాలసీలు. ఏదైనా ఎల్ఐసీ పాలసీని తీసుకోవచ్చు. ఎల్ఐసీలో అనేక రకాల పాలసీలను అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి గానీ.. నెలవారీ గానీ.. ఆరు నెలలకు ఒక సారి గానీ డబ్బును ఇన్వెస్ట్ చేయొచ్చు. తద్వారా భవిష్యత్‌లో మంచి రాబడిని పొందవచ్చు.

4. డబ్బు ఆదా చేయడానికి నాలుగో మార్గం పోస్టాఫీస్ స్కీమ్స్. డబ్బు ఆదా చేయడంలో పోస్టాఫీసు స్కీమ్స్ బాగా ఉపకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పోస్టాఫీస్.. అనేక రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.


Also Read:

ఆర్బీఐ ప్రకటనలు.. సామాన్యులపై వీటి ప్రభావం ఎంత

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విసుర్లు

For More Business News and Telugu News..

Updated Date - Aug 08 , 2024 | 07:39 PM