Share News

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 08:05 PM

EPFO పెన్షనర్‌లు జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందుతారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు.

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..
EPFO pensioners

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ స్కీమ్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఇకపై వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఏ బ్యాంకు లేదా ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS) ప్రతిపాదనను ఆమోదించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో మాండవ్య తెలిపారు. ఈ నేపథ్యంలో EPFO సభ్యులు పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చేందుకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు.


ఆధునీకరణ దిశగా

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధునీకరణ దిశగా సీపీపీఎస్ ఆమోదం ఒక మైలురాయి అని మంత్రి అన్నారు. దీని కింద పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా లేదా ఏ శాఖ నుంచైనా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమం పింఛనుదారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. దీని ద్వారా సమర్థవంతంగా వారి చెల్లింపులను సులభతరం చేసుకోవచ్చు. పింఛనుదారులకు సౌకర్యాలను మరింత మెరుగ్గా అందించడానికి, EPFOని మరింత పటిష్టమైన సంస్థగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ EPFOలోని 78 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.


దేశవ్యాప్తంగా

కేంద్రీకృత వ్యవస్థ పింఛను చెల్లింపు ఆర్డర్‌లను (PPOలు) ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా పింఛను పంపిణీని నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్లే పింఛనుదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. EPFO కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ IT ఎనేబుల్డ్ సిస్టమ్ (CITES 2.01)లో భాగంగా ఈ సదుపాయం జనవరి 1, 2025 నుంచి ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో CPPS ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS)కి తీసుకువస్తారు. CPPS అనేది వికేంద్రీకరించబడిన ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుంచి ఒక నమూనా మార్పు.


బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు

ప్రస్తుత పెన్షన్ పంపిణీ ప్రక్రియ నుంచి కొత్త వ్యవస్థ మార్పు ఉంటుంది. దీని కింద EPFO ప్రతి ప్రాంతీయ/ప్రాంతీయ కార్యాలయం కేవలం మూడు నాలుగు బ్యాంకులతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకోవలసి ఉంటుంది. దీంతో పింఛనుదారులు పెన్షన్ ప్రారంభించే సమయంలో వెరిఫికేషన్ కోసం బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. నిధులు విడుదలైన వెంటనే చెల్లింపు వారి ఖాతాలలో జమ అవుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త వ్యవస్థ పెన్షన్ పంపిణీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని EPFO భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 04 , 2024 | 08:09 PM