IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:35 PM
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాల వేడుకల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. వీటిలో భాగంగా ఈ టూర్ ప్యాకేజీలో మీరు దేవభూమి హరిద్వార్, రిషికేశ్ తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆ విశేషాలను ఇక్కడ చుద్దాం.
మీరు నవరాత్రుల సమయంలో ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. వాటిలో భాగంగా ఈ టూర్ ప్యాకేజీలో మీరు దేవభూమి హరిద్వార్, రిషికేశ్‌లను సందర్శించే అవకాశాన్ని పొందుతారు. హరిద్వార్, రిషికేశ్‌లను భారతదేశంలోని ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మీరు అనేక పురాతన దేవాలయాలు, ఆశ్రమాలను కూడా చూడవచ్చు.
ఎప్పటినుంచి
అయితే ఈ టూర్ ప్యాకేజీలో మీరు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు. ఎంత ఖర్చు అవుతుందనే అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. IRCTC ఈ టూర్ ప్యాకేజీ పేరు దేవభూమి హరిద్వార్- రిషికేష్. దీని ప్యాకేజీ కోడ్ WAR015. ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు హరిద్వార్, రిషికేశ్‌లలో గడుపుతారు. ఇది రైలు టూర్ ప్యాకేజీ కాగా, అక్టోబర్ 9, 2024న నుంచి ప్రారంభమవుతుంది. అబు రోడ్, అహ్మదాబాద్, అజ్మీర్, ఫల్నా, గాంధీనగర్ క్యాప్, కలోల్, మహేసనా జంక్షన్, మార్వార్ జంక్షన్, పాలన్‌పూర్ జంక్షన్, సబర్మతి జంక్షన్, సిధ్‌పూర్, ఉంఝా ప్రాంతాల నుంచి మొదలవుతుంది. ఈ టూర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్ మార్గంలో ఆ ప్రాంతాలకు చేరుకుని ఈ ప్యాకేజీలో పాల్గొనవచ్చు.
థర్డ్ క్లాస్ ఏసీలో రేట్లు
ఈ టూర్ ప్రయాణంలో మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే IRCTC మీకు ఆహారం, హోటల్ వసతి ఏర్పాట్లను కూడా చేస్తుంది. దీంతోపాటు టూర్ ప్యాకేజీ కింద మిమ్మల్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు క్యాబ్‌లను కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇక ఈ టూర్ ఛార్జీల విషయానికి వస్తే మీరు థర్డ్ క్లాస్ ఏసీలో ఒంటరిగా ప్రయాణిస్తే రూ. 27,900 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులతో ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.16,900. ఇది కాకుండా మీరు ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్నట్లయితే మీరు ఒక్కొక్కరికి రూ.14,100 చెల్లించాలి.
స్లిపర్ ఛార్జీలు
ఇక స్లిపర్ క్లాస్ ఛార్జీల విషయానికి వస్తే సింగిల్‌గా ప్రయాణిస్తే రూ. 25,300. ఇద్దరు చొప్పున ప్రయాణిస్తే ఒక్కరు రూ. 14,300 పే చేయాలి. ముగ్గురు చొప్పున ప్రయాణిస్తే ఒక్కరికి రూ.11,500 అవుతుంది. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణిస్తే ఒక్కరికి బడ్‌తో పాటు రూ.9,800, బెడ్ లేకుండా అయితే రూ. 3400 పే చేయాలి. ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం కోసం మీరు ఈ లింక్‌ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. https://www.irctctourism.com/pacakage_description?packageCode=WAR015
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్
Read More Business News and Latest Telugu News