Share News

Personal Finance: ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి.. లేదంటే డబ్బులు మటాషే..!

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:38 PM

Internet Banking Tips: గతంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుల వద్దకు వెళ్లి మాత్రమే చేయాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుని.. అవసరాన్నింటినీ అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌తోనే చేసేస్తున్నారు ప్రజలు.

Personal Finance: ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి.. లేదంటే డబ్బులు మటాషే..!
Online Banking

Internet Banking Tips: గతంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుల వద్దకు వెళ్లి మాత్రమే చేయాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుని.. అవసరాన్నింటినీ అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌తోనే చేసేస్తున్నారు ప్రజలు. బ్యాంకింగ్ సిస్టమ్‌లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఆన్‌లైన్, యూపీఎస్, ప్రత్యేక యాప్స్ వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి.

ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను సులువుగా పూర్తి చేసేస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ సదుపాయంతో ఈజీగా ఇతరులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారు. అయితే, టెక్నాలజీ వృద్ధి చెందడంతో పాటే.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లు కూడా పెరుగుతున్నారు. అందుకే.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరిపే సమయంలో కొన్ని సూచనలు పాటించాలి. ఇలా చేయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు. మరి ఆ సూచనలేంటో ఓసారి చూద్దాం.


పబ్లిక్ నెట్‌వర్క్‌లో వొద్దు..

సాధారణంగా కొంతమంది ప్రజలు తమ ఆఫీస్ కంప్యూటర్‌లో గానీ, పబ్లిక్ కంప్యూటర్‌(ఇంటర్నెట్ సెంటర్లలో)లో గానీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవుతుంటారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే హ్యాకర్లు అధికశాతం పబ్లిక్ సిస్టమ్స్‌పైనే దాడి చేస్తుంటారు. అందుకే.. ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకండి.


తెలియని మెయిల్స్ క్లిక్ చేయొద్దు..

మీకు ఏదైనా తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి ఇమెయిల్, స్పామ్ మెయిల్ వచ్చినట్లయితే పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఈ స్పామ్ మెయిల్స్‌తో హ్యాకర్లు మీ సిస్టమ్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ లింక్స్ ద్వారా వైరస్‌ను గానీ, ఏదైనా కోడ్‌ను గానీ పంపిస్తారు. తద్వారా మీ అకౌంట్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అందకే.. తెలియని మెయిల్స్‌కు స్పందించకుండా ఉండటమే ఉత్తమం.


వివరాలు చెప్పొద్దు..

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు పోలీసు, బ్యాంకింగ్ అధికారుల పేర్లతో కాల్ చేసి ఆర్థిక పరమైన, వ్యక్తిగత వివరాలను అడుగుతుంటారు. ఇలా మీకు కాల్ చేసి ఎవరైనా ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్ అడిగినా.. ఏదైనా లింక్ మీద క్లిక్ చేయమని కోరినా వారు చెప్పిన పనిని చేయొద్దు. ఒకవేళ మీరు వారు అడిగిన సమాచారం ఇచ్చినా.. వారు ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసినా మీ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి.


పాస్‌వర్డ్ మార్చండి..

మీరు నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీ పాస్‌వర్డ్‌ని తరచుగా మార్చడం ఉత్తమం. నిర్దిష్ట సమయం తరువాత పాస్‌వర్డ్‌ను మారుస్తుండాలి. ఇలా చేయడం ద్వారా మీ అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. అయితే, మీ పాస్‌వర్డ్‌ని కూడా చాలా స్ట్రాంగ్‌గా పెట్టాలి.


Also Read:

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఏంటంటే..?

నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతారా..?

For More Business News and Telugu News..

Updated Date - Aug 02 , 2024 | 03:38 PM