Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Jul 10 , 2024 | 10:16 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (జులై 10న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్‌లోని అన్ని సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.15 గంటల నాటికి సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టపోయి 79989 పరిధిలో ఉండగా, నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 24330 స్థాయి వద్ద ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (జులై 10న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్‌లోని అన్ని సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.15 గంటల నాటికి సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టపోయి 79989 పరిధిలో ఉండగా, నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 24330 స్థాయి వద్ద ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 582 పాయింట్లు తగ్గింది. అమెరికన్ ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం M&M, HCL టెక్, SBI, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, NTPC, దివిస్ ల్యాబ్స్ వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. జూలై 9న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.314.46 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.1,416.46 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
జపాన్ ద్రవ్యోల్బణం డేటా, చైనా నుంచి సిపిఐ డేటాపై పెట్టుబడిదారులు దృష్టి పెట్టడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన నిక్కీ 0.12% జంప్ చేయగా, దక్షిణ కొరియా కోస్పి 0.22% క్షీణతతో ట్రేడవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ASX200 0.49 శాతం క్షీణించింది. అమెరికాలోని మార్కెట్‌లో మిశ్రమ పరిస్థితి కనిపించింది. S&P 500 0.07 శాతం లాభపడి మరో రికార్డు గరిష్ట స్థాయిని తాకగా, నాస్‌డాక్ 0.14 శాతం పెరిగింది. టెక్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.13 శాతం క్షీణించింది.
ఇది కూడా చదవండి:
ఈక్విటీ మదుపరుల సంపద రూ.451 లక్షల కోట్లు
సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలు మించొద్దు
For Latest News and Business News click here