Share News

Accident: పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:59 AM

బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ఉన్నావ్‌(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్‌లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

Accident: పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు
Unnao accident Uttar Pradesh

బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ఉన్నావ్‌(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్‌లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని బంగార్మావు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ దాదాపు 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రుల చికిత్స స్థితిగతులను స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


స్థానికులు

ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ బస్సు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బీహార్‌లోని మోతీహరి జిల్లా పిపాల్‌కోటి నుంచి ఢిల్లీలోని భజన్‌పురాకు బయలుదేరింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉదయం 5.30 గంటల సమయంలో బస్సు గఢా గ్రామం వద్దకు చేరుకున్న క్రమంలో పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం బలంగా జరిగిన నేపథ్యంలో భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రమంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నారు. మరణించిన వారిలో 14 మంది పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి, ఒక బాలిక ఉన్నారు.


ఇప్పటివరకు 18 మంది

ఈ ప్రమాదం ఆగ్రాకు 247 కిలోమీటర్ల ముందు ఉన్నావ్‌లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాదంలో డబుల్ డెక్కర్ బస్సులో కొంత భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఒకవైపు నిద్రిస్తున్న వారు పూర్తిగా చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లు సీఓ బంగార్మావు తెలిపారు. వీరిలో 14 మందిని కూడా గుర్తించారు. మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బీహార్‌లోని శివహర్ జిల్లా హిరాగాలో నివాసముంటున్న లాల్‌బాబు దాస్ కుటుంబం జీవనోపాధి కోసం ఢిల్లీలో నివసిస్తున్నట్లు తెలిపారు.


సెలవులు ముగించుకుని

వేసవి సెలవుల్లో గ్రామానికి వెళ్లి సెలవులు ముగించుకుని డబుల్ డెక్కర్ బస్సులో ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లాల్‌బాబు దాస్, ఆయన కుమారుడు రామ్ ప్రవేశ్, భరత్ భూషణ్, బాబు దాస్ మృతి చెందారు. బీహార్‌లోని ముల్హారీలోని శివోలిలో నివాసం ఉంటున్న చాందినీ కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించింది. ఈ బస్సులో చాందినితో పాటు ఆమె భర్త షఫీక్, కుమారుడు తౌఫిక్, కోడలు మున్నీ ప్రయాణిస్తున్నారు. వీరంతా చనిపోయారు. మూడో కుటుంబం ఢిల్లీలోని భజన్‌పురాలో నివసిస్తున్న షబానాది. ఈ ప్రమాదంలో షబానాతో పాటు ఆమె కూతురు నగ్మా కూడా అక్కడికక్కడే మృతి చెందింది.


ఇది కూడా చదవండి:

Maharashtra: బయటకు తీసుకెళ్లని భర్త.. కోపంతో భార్య ఏం చేసిందంటే?

Weather Update: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

National : నకిలీ కంపెనీలు.. బలవంతపు చాకిరీ!

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 09:28 AM