S&P: భారత వృద్ధి రేటును 6.8%కి తగ్గించిన S&P..ఆర్బీఐ కంటే తక్కువగా..
ABN , Publish Date - Jun 24 , 2024 | 01:35 PM
S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ(india) GDP వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం.
S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ(india) GDP వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపన డిమాండ్ వంటి పలు అంశాల నేపథ్యంలో తగ్గించినట్లు తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంత ఆర్థిక దృక్పథంలో భాగంగా S&P గ్లోబల్ రేటింగ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధితో భారతదేశ ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని తెలిపింది.
అదే సమయంలో 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(current fiscal year) ఆర్థిక వృద్ధి 6.8 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎస్ & పీ వెల్లడించింది. దీంతోపాటు 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు వరుసగా 6.9 శాతం, 7 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. FY 2025 కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కంటే S&P తక్కువగా అంచనా వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల ప్రారంభంలో గ్రామీణ డిమాండ్ మెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతానికి పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు(growth rate) 7.2 శాతంగా అంచనా వేసింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) అంచనా ప్రకారం భారత జీడీపీ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలిపింది. మూడీస్ రేటింగ్స్, డెలాయిట్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 6.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. మోర్గాన్ స్టాన్లీ 6.8 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.
ఇది కూడా చదవండి:
Bank Holidays: జూలై 2024లో బ్యాంకు సెలవులు..రాష్ట్రాల వారీగా పూర్తి జాబితా..
Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే
Next IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. ఏకంగా 10..
For Latest News and Business News click here