Share News

Tax Free Countries: మీకు తెలుసా? ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:34 PM

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయింపులు, కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు.. ఎన్నో అంశాలను పేర్కొన్నారు.

Tax Free Countries: మీకు తెలుసా? ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు..!
Tax Free Countries

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయింపులు, కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు.. ఎన్నో అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల విధానం, పరోక్ష పన్నుల విధానంలో మార్పులు, చేర్పులు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం సవ్యంగా నడవడానికి ఈ పన్నులు చాలా కీలకం. అందుకే ప్రపంచంలో ఏ దేశమైనా ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నులను విధిస్తాయి.

అయితే, కొన్ని దేశాలు తమ పౌరులపై ప్రత్యక్ష పన్నులు విధించవు. ఆ దేశాల్లో ప్రజలు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం పరోక్ష పన్నుల ద్వారా మాత్రమే అక్కడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ సైతం అద్భుతంగా ఉంది. మరి ప్రజలపై ఎలాంటి పన్నులు విధించని దేశాలంటో ఓసారి చూద్దాం..


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)..

ఈ జాబితాలో మొదటగా వినిపించే పేరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం వ్యక్తిగత పన్నులను అమలు చేయడం లేదు. ప్రభుత్వం పూర్తిగా వ్యాట్, ఇతర సుంకాల వంటి పరోక్ష పన్నులపై ఆధారపడి నడుస్తోంది. చమురు, పర్యాటకం రంగం కారణంగా UAE ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది.

బహ్రెయిన్..

బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ఆ దేశ ప్రజల నుండి ఆదాయపు పన్ను వసూలు చేయదు. ఇక్కడ కూడా దుబాయ్‌లో ఉన్న వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది. ప్రభుత్వం తన ఖర్చులను పరోక్ష పన్నుల ద్వారా భర్తీ చేస్తుంది. ఈ వ్యవస్థ కారణంగా.. బహ్రెయిన్‌లో చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది.


కువైట్..

కువైట్‌లోనూ ఆ దేశ పౌరులపై ఆదాయపు పన్ను విధించలేదు. కువైట్ ఆర్థిక వ్యవస్థ చమురు ఉత్పత్తిపై ఆధారపడి ఉంది. చమురు ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి ప్రత్యక్ష పన్నులను వసూలు చేయడం లేదు.

సౌదీ అరేబియా..

సౌదీ అరేబియా కూడా దేశంలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్ను నుండి తన ప్రజలకు మినహాయింపు ఇచ్చింది. పరోక్ష పన్నుల విధానం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా నడుస్తోంది.


బహమాస్..

బహామాస్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశం తన ప్రజల నుండి ఆదాయపు పన్ను వసూలు చేయదు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు ఆదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యాటక రంగంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా నడుస్తోంది.

బ్రూనై..

ఈ ఇస్లామిక్ దేశంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు ద్వారానే ఆర్థికంగా రాణిస్తోంది. దీంతో ఇక్కడి ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదని భావించి.. పన్నులు వసూలు చేయడం లేదు.


కేమాన్ దీవులు..

ఉత్తర అమెరికాలో ఉన్న ఈ దేశం టూరిజం ద్వారా ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది. ప్రజలు తమ సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ దేశంలో అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి. తద్వారా ఇక్కడి పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ కారణంగా ఇక్కడి ప్రభుత్వం తన ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదు.

ఒమన్..

బహ్రెయిన్, కువైట్ మాదిరిగానే.. ఒమన్‌ కూడా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఇక్కడ తన దేశ పౌరులపై ఎలాంటి పన్నుల భారం మోపలేదు. చమురు, గ్యాస్ విక్రయం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.


ఖతార్..

గల్ఫ్ దేశాల మాదిరిగానే.. ఖతార్‌లో కూడా అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశం చమురు పరిశ్రమలే ఈ దేశ ఆర్థిక శక్తికి ఆధారం. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో.. ఖతార్ ప్రభుత్వం ఈ దేశ పౌరులపై ఎలాంటి ఆదాయపు పన్నులు విధించలేదు. ఈ దేశం చిన్నదేశమే అయినప్పటికీ.. చాలా ధనిక దేశం అని చెప్పొచ్చు.

మొనాకో..

ఇది ఐరోపాలో ఉన్న ఒక చిన్న దేశం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఈ దేశం పర్యాటకం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఈ దేశం తమ ప్రజలపై ఎలాంటి ప్రత్యక్ష పన్నులు విధించడం లేదు.


Also Read:

ఈ వేస్ట్ రీసైక్లింగ్‌పై శాసనమండలిలో పవన్ కామెంట్స్...

తగ్గిన బంగారం ధర.. దుకాణాలకు పోటెత్తిన జనం

తెలంగాణ బడ్జెట్‌లో రైతులకు వరాలు..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 25 , 2024 | 01:34 PM