EPFO: బడ్జెట్‌కు ముందు EPFO సభ్యులకు శుభవార్త
ABN , Publish Date - Jul 12 , 2024 | 09:33 AM
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది EPF సభ్యులపై ప్రభావం చూపనుంది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో EPFO 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వడ్డీ రేటు పెంపును ప్రకటించగా, తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించింది.
EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరిలో 2023-24 కోసం PFపై వడ్డీని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పీఎఫ్ వడ్డీని 8.15 శాతం నుంచి 8.25 శాతానికి పెంచాలని నిర్ణయించారు. CBT నిర్ణయం తర్వాత 2023-24కి సంబంధించిన EPF డిపాజిట్లపై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించగా అది ఇప్పుడు ఆమోదించబడింది. దీంతో ఎప్పుడు పీఎఫ్ వడ్డీ తమ ఖాతాలో జమ అవుతుందా అని ఎదురుచూసిన ఉద్యోగులకు ఊరట లభించనుంది.
వడ్డీని తగ్గించినప్పుడు
మార్చి 2022లో EPFO సుమారు 7 కోట్ల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ఉద్యోగులకు EPFపై వడ్డీ 2020-21లో 8.5 శాతం నుంచి 2021-22కి నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అనేక మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వడ్డీ ఎప్పుడు వస్తుంది?
ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటును ప్రతి సంవత్సరం EPFO ప్రకటిస్తుంది. ప్రస్తుతం దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. EPFO వడ్డీని నిర్ణయించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒకసారి మార్చి 31న చెల్లించబడుతుంది.
ఇది కూడా చదవండి:
Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
ఇంధన రంగంలో రూ.8.4 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు
For Latest News and Business News click here