Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:59 PM
క్యాష్ డిపాజిట్ మెషిన్ లేదా ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్ ద్వారా అనేక మంది కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బును జమ చేస్తారు. కానీ అనేక మందికి ఒకేసారి తమ ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చనే విషయం తెలియదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మీరు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు క్యాష్ డిపాజిట్ మెషిన్ లేదా ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్ (ADWM) ద్వారా మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే వీటి ద్వారా ప్రతిరోజు ఎంత మొత్తం క్యాష్ డిపాజిట్ చేయాలనేది అనేక మందికి తెలియదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం. మీరు ఈ మెషీన్లు బ్యాంక్ బ్రాంచ్‌లో లేదా ఇతర ATMల దగ్గర ఉంటాయి. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా మీరు బ్యాంకు శాఖకు వెళ్లకుండా వెంటనే మీ ఖాతాలో నగదు జమ చేసుకోవచ్చు. నగదు డిపాజిట్ చేసిన తర్వాత మీరు లావాదేవీ రసీదుని పొందుతారు. ఇది అప్‌డేట్ చేయబడిన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చూపిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): క్యాష్ డిపాజిట్ మెషిన్లో SBIలో కార్డ్‌లెస్ డిపాజిట్ ద్వారా నగదు డిపాజిట్ పరిమితి రూ. 49,900. అదే సమయంలో మీరు డెబిట్ కార్డ్ (పాన్ కార్డ్ ఖాతాతో లింక్ చేయబడాలి) ద్వారా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): ఈ బ్యాంకు ఖాతాతో పాన్ లింక్ చేయబడితే డెబిట్ కార్డ్ ద్వారా రోజుకు నగదు డిపాజిట్ పరిమితి రూ. 2 లక్షలు. పాన్ నమోదు చేయకపోతే పరిమితి రూ. 49,999. కార్డ్‌లెస్ లావాదేవీల పరిమితి (కేవలం ఖాతా నంబర్‌ను నమోదు చేయడం ద్వారా) రోజుకు రూ. 20,000.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): ఈ బ్యాంకు ఖాతాతో PAN లింక్ చేయబడితే గరిష్టంగా రూ. 1 లక్ష డిపాజిట్ చేసుకోవచ్చు. పాన్ లింక్ చేయకుంటే రూ.49,900 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
HDFC బ్యాంక్: సేవింగ్స్ ఖాతాకు రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి రూ. 2 లక్షలు. కాగా కరెంట్ ఖాతాలో ఇది రూ.6 లక్షలు. డిపాజిట్ పరిమితి కార్డ్‌లెస్, కార్డ్ ఆధారిత రెండింటికీ సమానంగా ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇక్కడ పాన్ కార్డ్ లేకుండా రూ. 49,999 డిపాజిట్ చేయవచ్చు. పాన్‌తో రూ.1,49,999 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
ఈ కార్డ్ లెస్ డిపాజిట్లు ఆయా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. కాబట్టి మీరు మీ బ్యాంకు ఇలాంటి డిపాజిట్ల విషయంలో ఆయా ఖాతాదారులకు ఎంత మేరకు గరిష్టంగా అనుమతిస్తుందనే విషయం తెలుసుకుని డిపాజిట్ చేస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అయితే ఎన్ని ఏటీఎం కేంద్రాలలో క్యాష్ డిపాజిట్ మెషిన్ లేదా ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్లు అందుబాటులో ఉండవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటి సౌకర్యాలుంటాయి.
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
Read More Business News and Latest Telugu News