Share News

Zee entertainment: భారీ నష్టాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు.. రూ. 2,000 కోట్ల నిధుల మళ్లింపు నిజమేనా?

ABN , Publish Date - Feb 21 , 2024 | 01:00 PM

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఓ నివేదిక నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి.

Zee entertainment: భారీ నష్టాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు.. రూ. 2,000 కోట్ల నిధుల మళ్లింపు నిజమేనా?

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ కంపెనీలో సుమారు 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2000 కోట్లు) మళ్లింపు జరిగిందని మార్కెట్ రెగ్యులేటర్ SEBI గుర్తించిందని ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో జీ ఎంటర్‌టైమెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 14.3 శాతం వరకు క్షీణించి రూ. 165.5కి చేరాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 2027 నాటికి రూ.1.41 లక్షల కోట్లు


సోనీ గ్రూప్ ఈ కంపెనీతో ఇటీవల విలీన ఒప్పందం రద్దు చేసుకుంది. జీ ఫౌండర్స్ విచారణలో ఈ కంపెనీ నుంచి సుమారు రూ. 200 కోట్ల విలువైన నిధులు మళ్లించబడినట్లు SEBI కనుగొంది. ఈ మొత్తం సెబీ దర్యాప్తు ప్రారంభానికి ముందు అంచనా వేసిన దాని కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సెబీ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే సెబీ సమీక్ష,కంపెనీ ప్రతిస్పందన తర్వాత రూ. 2000 కోట్ల నిధుల మళ్లింపు సంఖ్య మారవచ్చని ఈ నివేదికలో చెప్పబడింది.

సెబీ దర్యాప్తులో ఇంత భారీ నిధుల మళ్లింపు నిజమైతే జీ(zee) సీఈవో పునీత్ గోయెంకా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోనీతో సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడం ఇప్పుడు వారికి సవాలుగా మారింది. జనవరి 22న రెండేళ్ల చర్చల తర్వాత, సోనీ ఇండియా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.

Updated Date - Feb 21 , 2024 | 01:00 PM