Chittoor: కత్తితో ఆటో డ్రైవరు వీరంగం..
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:17 PM
ఆటో డైవ్రర్(Auto Diverter) కత్తితో విచక్షణా రహితంగా రెచ్చిపోయాడు. వేకువ జామున 4 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికెళ్లి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అడ్డుకున్న అతడి భార్య, మామనూ గాయపరిచాడు. రక్తం కారుతుండగా ముగ్గురూ పోలీసు స్టేషనుకు పరుగు తీశారు. తెల్లారేసరికి పట్టణ ప్రధాన రహదారిలో కనిపించిన రక్తపు మరకలతో శ్రీకాళహస్తి(Srikalahasti)లో కలకలం రేగింది.
- స్నేహితుడి కుటుంబంపై దాడితో ముగ్గురికి తీవ్రగాయాలు
- శ్రీకాళహస్తిలో కలకలం
శ్రీకాళహస్తి(చిత్తూరు): ఆటో డైవ్రర్(Auto Diverter) కత్తితో విచక్షణా రహితంగా రెచ్చిపోయాడు. వేకువ జామున 4 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికెళ్లి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అడ్డుకున్న అతడి భార్య, మామనూ గాయపరిచాడు. రక్తం కారుతుండగా ముగ్గురూ పోలీసు స్టేషనుకు పరుగు తీశారు. తెల్లారేసరికి పట్టణ ప్రధాన రహదారిలో కనిపించిన రక్తపు మరకలతో శ్రీకాళహస్తి(Srikalahasti)లో కలకలం రేగింది.
ఈ వార్తను కూడా చదవండి: టాఫిక్ ఎస్‌ఐని చెప్పుతో కొట్టిన మహిళ
పట్టణంలోని జెట్టిపాళేనికి చెందిన సతీష్, ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన మణి ఆటో డ్రైవర్లు. వీరిద్దరూ స్నేహితులు. మద్యంమత్తులో తరచూ వాగ్వాదం చోటు చేసుకునేది. సోమవారం రాత్రి ముత్యాలమ్మ గుడి వీధిలో మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువన నాలుగున్నర గంటల సమయంలో కత్తి చేత పట్టుకున్న మణి.. జెట్టిపాళెం(Jettypalem)లోని సతీష్ ఇంటికెళ్లి తలుపు కొట్టాడు. వెలుపలకు వచ్చిన సతీష్ పై కత్తితో దాడి చేశాడు. అరుపులు విన్న కీర్తన.. తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో ఆమెపైనా నిందితుడు కత్తితో దాడి చేశాడు. కీర్తన తండ్రి గణేష్ వచ్చి మణిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా, అతడిపైనా దాడి చేశాడు. దీంతో రక్తం కారుతుండా ముగ్గురూ జెట్టిపాళెం నుంచి పెళ్లి మండపం మీదుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్(One Town Police Station)కు పరుగుతీశారు. వెంటనే వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సతీష్ కు పొట్ట పైన, కీర్తనకు నడుము కింద, గణే్‌షకు చేతిపైన కత్తిపోట్లతో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మణి కోసం గాలిస్తున్నారు. బాధితులు పరుగు తీసిన రోడ్డంతా రక్తపు మరకలయ్యాయి.
ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా
ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?
ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!
Read Latest Telangana News and National News