Share News

Cyber ​​criminals: బంగారం తాకట్టుపెట్టి సైబర్‌ నేరగాళ్లకు రూ.8.26 లక్షలు సమర్పించారుగా..

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:44 AM

కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, కస్టమ్స్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.

Cyber ​​criminals: బంగారం తాకట్టుపెట్టి సైబర్‌ నేరగాళ్లకు రూ.8.26 లక్షలు సమర్పించారుగా..

- కస్టమ్స్‌ అధికారుల పేరుతో బెదిరింపులకు భయపడిన మహిళ

హైదరాబాద్‌ సిటీ: కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, కస్టమ్స్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో మలేషియాకు పంపిన కొరియర్‌లో మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్ధాలు ఉన్నాయని, దీనిపై ఢిల్లీ పోలీసులతో మాట్లాడుకోవాలని మరొకరికి కాల్‌ కలిపాడు. పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తి మహిళతో మాట్లాడాడు. మనీ ల్యాండరింగ్‌(Money Laundering), డ్రగ్స్‌ కేసులకు సంబంధించి పెద్ద ముఠా పట్టుబడిందని. వారి నుంచి మీ వివరాలు లభ్యమయ్యాయని, మీపై కూడా కేసు నమోదైందని బెదిరించాడు.

ఇదికూడా చదవండి: 22 నిమిషాల్లో.. 21.24 లక్షలు ఫ్రీజ్‌


బాధితురాలు ఆ పార్సిల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపినా.. కేసు నుంచి తప్పించేందుకు డబ్బు ఖర్చు అవుతుందన్నాడు. అప్పటికే భయపడిన మహిళ కేసు నుంచి బయట పడేందుకు అతడు సూచించిన ఖాతాకు డబ్బులు పంపింది. కేసు ఢిల్లీ పోలీసులు నమోదు చేశారని, కేసు మూసేయించాలంటే ఢిల్లీ వెళ్లాలని చెప్పిన సైబర్‌ నేరగాడి మాటలు నమ్మి నగలు తాకట్టు పెట్టి మరీ అతడు సూచించిన ఖాతాకు డబ్బులు పంపింది. ఇలా మహిళ నుంచి రూ.8.26 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేయడం మానేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 11:44 AM