Share News

Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌గా బీటెక్‌ విద్యార్థి..

ABN , Publish Date - Jul 20 , 2024 | 09:30 AM

గంజాయికి అలవాటుపడిన ఓ బీటెక్‌ విద్యార్థి డ్రగ్‌ పెడ్లర్‌(Drug peddler)గా మారాడు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తుండగా.. అతడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌గా బీటెక్‌ విద్యార్థి..

- నార్కోటిక్‌ దాడుల్లో ఆరుగురు పట్టివేత

హైదరాబాద్: గంజాయికి అలవాటుపడిన ఓ బీటెక్‌ విద్యార్థి డ్రగ్‌ పెడ్లర్‌(Drug peddler)గా మారాడు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తుండగా.. అతడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌పై నార్కోటిక్‌ బృందం, ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీసులు గురువారం రాత్రి సంయుక్తంగా దాడులు చేసి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకం దారుడితోపాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.

సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌(Huzurabad) పట్టణానికి చెందిన ఓ యువకుడు (21) ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతూ.. ఇక్కడ ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా, అతనికి సిరిసిల్ల సమీపంలోని ఇల్లంతకుంటకు చెందిన నవీన్‌(25)తో పరిచయం ఏర్పడింది.

ఇదికూడా చదవండి: 8 ఏళ్లుగా నగరంలోనే నైజీరియన్‌ స్మగ్లర్‌


నవీన్‌ భద్రాచలం ఏజెన్సీ ఏరియా(Bhadrachalam Agency Area) నుంచి గంజాయిని తీసుకొచ్చి అతనికి సరఫరా చేసేవాడు. ఈక్రమంలో గంజాయికి అలవాటుపడ్డ సదరు యువకుడు పెడ్లర్‌గా మారాడు. పరిసర ప్రాంతాలలోని యువకులకు గంజాయిని అమ్మేవాడు. సదరు యువకుడు మరో ఐదుగురు విద్యార్థులతో కలిసి ఓ హాస్టల్‌లో గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం రాత్రి నార్కోటిక్‌ బృందం, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పెడ్లర్‌గా మారిన యువకుడిపై ఇదే కేసులో మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌లో సైతం ఓ కేసు నమోదైంది. ఈ మేరకు వీరిపై కేసులు నమోదు చేశామని, గంజాయి అమ్మకందారుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 09:30 AM