Share News

Hyderabad: రేవ్‌పార్టీలో డ్రగ్స్‌, విదేశీ మద్యం..

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:00 AM

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌(Hyderabad IT Corridor)లో.. సైబర్‌టవర్స్‌ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్‌పార్టీని ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు.

Hyderabad: రేవ్‌పార్టీలో డ్రగ్స్‌, విదేశీ మద్యం..

- మాదాపూర్‌లో అర్ధరాత్రి దాడులు

- 20 మంది నిందితుల అరెస్టు

- వారిలో ఆరుగురు యువతులు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌(Hyderabad IT Corridor)లో.. సైబర్‌టవర్స్‌ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్‌పార్టీని ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురు యువతులు సహా.. 20 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.25 లక్షల విలువైన విదేశీ/దేశీయ మద్యం, డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో ఒక గ్రాము కొకైన్‌, 84 మిల్లీ గ్రాముల ఓజీ కుష్‌ డ్రగ్‌, రెండు గ్రాముల ఎండీఎంఏ ఉన్నాయని, 12 విదేశీ మద్యం సీసాలు లభించాయని ఎస్టీఎఫ్‌ అధికారులు తెలిపారు. బేగంపేట(Begumpet)కు చెందిన నాగరాజు యాదవ్‌ అనే బిల్డర్‌ బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్‌పార్టీని నిర్వహిం చారని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.2 లక్షల రుణం ఇస్తామని.. రూ.1.20 లక్షలు కాజేశారు


city1.2.jpg

నాగరాజు ఈ నెల 12న తన స్నేహితులు నితిన్‌, సాయి, కిశోర్‌తో కలిసి గోవాలో 3 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేశారని చెప్పారు. మరో స్నేహితుడు సాయికుమా ర్‌ యాదవ్‌ దుబాయ్‌ నుంచి 12 విదేశీ మద్యం బాటిళ్లు తెప్పించినట్లు గుర్తించామ న్నారు. రేవ్‌పార్టీ జరిగిన మాదాపూర్‌లోని క్లౌడ్‌-9 సర్వీస్‌ అపార్ట్‌ మెంట్‌లో రూమ్‌ను కిశోర్‌ బుక్‌ చేశాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 10:00 AM