Share News

Hyderabad: పాత నేరస్థుల మధ్య ఆదిపత్య పోరు.. ఒకరి హత్య

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:01 PM

ఇద్దరు పాత నేరస్థులు అనేక మార్లు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా వారి తీరు మారలేదు. స్థానికంగా పైచేయి తమదే కావాలని పలుమార్లు గొడవకు దిగేవారు. ఈ గొడవల్లో ఒకరు హత్యకు గురయ్యారు. బంజారాహిల్స్‌ పోలీసులు(Banjara Hills Police) తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నంబరు 10 సింగాడ బస్తీకి చెందిన ఖాజా పాషా(20) దొమ్మిలు, దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లాడు.

Hyderabad: పాత నేరస్థుల మధ్య ఆదిపత్య పోరు.. ఒకరి హత్య

హైదరాబాద్: ఇద్దరు పాత నేరస్థులు అనేక మార్లు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా వారి తీరు మారలేదు. స్థానికంగా పైచేయి తమదే కావాలని పలుమార్లు గొడవకు దిగేవారు. ఈ గొడవల్లో ఒకరు హత్యకు గురయ్యారు. బంజారాహిల్స్‌ పోలీసులు(Banjara Hills Police) తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నంబరు 10 సింగాడ బస్తీకి చెందిన ఖాజా పాషా(20) దొమ్మిలు, దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లాడు. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోడ్డు నంబరు 12 ఎన్‌బీ నగర్‌కు చెందిన పర్ష కూడా పలు కేసుల్లో నిందితుడు. ఓ కేసులో పదిహేను రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు. 23న రోడ్డు నంబరు 13 శ్రీరాంనగర్‌(Road No. 13 Sriramnagar)లో పాషా, పర్ష, వీరి స్నేహితులు మహేష్‌, వంశీ, సాయి కలిసి మద్యం తాగారు. మత్తులో పాషా, పర్ష మధ్య మరోసారి గొడవ జరిగింది. పాషా ఆగ్రహంతో పర్షను కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇదికూడా చదవండి: మహిళను బెదిరించి రూ. 2.90లక్షలు లూటీ.. అసలేం జరిగిందంటే..


కక్ష్య పెంచుకున్న పర్ష ఎలాగైన పాషా అడ్డు తొలగించాలని భావించాడు. ఇందుకు మహేష్‌, వంశీ, సాయి(Mahesh, Vamsi, Sai) సహాయం కోరాడు. అదే రోజు రాత్రి పాషా రోడ్డు నంబరు 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లిన్నట్టు తెలిసింది. నలుగురు కలిసి ఓకే ద్విచక్ర వాహనంపె వెళ్లి పాషా రాగానే పర్ష దొడ్డు కర్రతో తలపై బలంగా మోది అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు పాషాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఆధారాలు సేకరించడంతో పాటు మహేశ్‌, వంశీ, సాయిలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 01:01 PM