Share News

Hyderabad: నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి..

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:56 AM

నిర్లక్ష్య డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఆ వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడటంతో మృతి చెందాడు.

Hyderabad: నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి..

హైదరాబాద్: నిర్లక్ష్య డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఆ వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడటంతో మృతి చెందాడు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌(Sanatnagar Police Station) పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాట్రగడ్డ గంగాధర్‌ (50) ప్రగతినగర్‌లో ఉంటూ ఓ సంస్థలో ఏజీఎంగా పనిచేస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్


అదే సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న విజయరామరాజు (47)తో కలిసి బైక్‌పై ఎర్రగడ్డ వైపునకు వెళ్తున్నాడు. బైక్‌ భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌(Bharatnagar Flyover)పై కి రాగానే మరో బైక్‌ వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్‌పై వెనుక కూర్చున్న గంగాధర్‌ అదుపుతప్పి ఆర్‌టీసీ బస్సు వెనుక టైర్ల కింద పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే చనిపోయాడు. విజయరామరాజుకు తీవ్రగాయాలయ్యాయి.


.........................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................

CV Anand: మీ వెంట నేనున్నా.. ధైర్యంగా పనిచేయండి

- పోలీసు అధికారులకు సీపీ భరోసా

city1.3.jpg

హైదరాబాద్: వినాయక నిమజ్జన ఊరేగింపు, మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపుల నేపథ్యంలో సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Police Commissioner CV Anand) తెలిపారు. గురువారం ఆయన సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కాంతిలాల్‌ పాటిల్‌, ఇతర పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడారు. ‘నగరంలో ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ఈ్‌స్ట జోన్‌లు రెండూ సున్నిత ప్రాంతాలు. పోలీసు అధికారులు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలి. అల్లర్లు సృష్టించే రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై నిరంతరం నిఘా పెట్టాలి.


మతసామరస్యానికి ఆటంకం కలిగించే వారిని గుర్తించి వెంటనే కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు బైండోవర్‌ చేయండి. విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో రద్దీని నియంత్రించి వాహనాలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోండి. విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీ వెంట నేనున్నా’ అని సీపీ భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు సీపీకి వివరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్‌, మలక్‌పేట ఏసీపీ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

city1.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 13 , 2024 | 08:58 AM