Share News

Hyderabad: డ్రగ్స్‌ కేసులో కుమారుడు పట్టుబడ్డాడని బెదిరించి..

ABN , Publish Date - Jul 16 , 2024 | 10:36 AM

డ్రగ్స్‌కేసులో కుమారుడు పట్టుబడ్డాడని తల్లిదండ్రులను బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వారి నుంచి రూ.50వేలు దోపిడీ చేశారు. ఈ ఘటన అల్వాల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది.

Hyderabad: డ్రగ్స్‌ కేసులో కుమారుడు పట్టుబడ్డాడని బెదిరించి..

- రూ. 50 వేలు దోపిడీ

- సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు

హైదరాబాద్: డ్రగ్స్‌కేసులో కుమారుడు పట్టుబడ్డాడని తల్లిదండ్రులను బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వారి నుంచి రూ.50వేలు దోపిడీ చేశారు. ఈ ఘటన అల్వాల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. అల్వాల్‌ పోలీసులు కథనం ప్రకారం... ఆర్టీసీలో ఉద్యోగం చేసే మధుసూదన్‌ దంపతుల కుమారుడు రాహుల్‌ (25), స్నేహితుడి కుటుంబంతో కలిసి ఈనెల 12న తిరుమల వెళ్లారు. సోమవారం ఉదయం 8.30గంటల సమయంలో తిరుమలలోని క్వార్టర్స్‌లో సెల్‌ఫోన్‌ ఉంచి రాహుల్‌ దైవదర్శనానికి వెళ్లాడు. అదే సమయంలో మచ్చబొల్లారంలో ఉన్న మధుసూదన్‌ ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి రాహుల్‌ డ్రగ్స్‌తో పట్టుపడ్డాడని బెదిరించారు. ఒకసారి తన కుమారుడు రాహుల్‌తో మాట్లాడించాలని మధుసూదన్‌ అడగితే దుర్భాషలాడుతూ రాహుల్‌ను కొడుతున్నట్లుగా అరుపులు వినిపించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 5 నిమిషాల ప్రయాణానికి 1/2 గంట...


పోలీసుల మాదిరిగా హారన్‌ శబ్దాలను వినిపిస్తూ ఢిల్లీకి తీసుకెళుతున్నామని రాహుల్‌ తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేశారు. ఆ సమయంలో రాహుల్‌ ఫోన్‌ సైతం స్విచ్‌ఆఫ్‏లో ఉండటంతో ఇది నిజమే అయి ఉంటుందని భావించిన ఆ దంపతులు తమ కుమారుడిని రక్షించాలని కోరడంతో ఫోన్‌లోని వ్యక్తి రూ.50 వేలు పంపించాలని కోరాడు. దీంతో మధుసూదన్‌ మూడు దఫాలుగా డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అనంతరం మరో రూ.లక్ష పంపించాలని డిమాండ్‌ చేయడంతో మోసం జరుగుతుందని గమనించిన బంధువులు వారిని అప్రమత్తం చేసి అల్వాల్‌ పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో తిరుమల నుంచి రాహుల్‌ కూడా ఫోన్‌ చేయడంతో మోసపోయామని మధుసూదన్‌ నిర్ధారణకు వచ్చి అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 10:36 AM