Share News

Shocking: పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..!

ABN , Publish Date - Aug 09 , 2024 | 07:44 PM

వారిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. బంధుమిత్రులతో కాసేపు సరదాగా గడిపారు.. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్లారు.. అక్కడ ఏమైందో ఏమో.. ఇద్దరూ గొడవపడ్డారు.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు..

Shocking: పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..!
Karnataka Couple Fight Hours After Wedding

వారిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం (Wedding) చేసుకున్నారు.. బంధుమిత్రులతో కాసేపు సరదాగా గడిపారు.. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్లారు.. అక్కడ ఏమైందో ఏమో.. ఇద్దరూ గొడవపడ్డారు.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.. కర్ణాటక (Karnataka)లో జరిగిన ఈ విషాద ఘటన ఎంతో మందిని కలిచి వేస్తోంది (Crime News).


కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని చంబరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్ అనే 27 ఏళ్ల యువకుడు బట్టల వ్యాపారిగా పని చేస్తున్నాడు. అతడు కొన్ని ఏళ్లుగా 18 ఏళ్ల లిఖితతో ప్రేమాయాణం నడుపుతున్నాడు. ఇద్దరూ తమ ప్రేమ వివాహానికి పెద్దలను ఒప్పించారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగస్టు 7వ తేదీన వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం బంధుమిత్రులతో కాసేపు సరదాగా గడిపారు. సాయంత్రం సమయంలో అదే గ్రామంలో ఉంటున్న తన బంధువుల ఇంటికి నవీన్ తన భార్య, అత్తమామలతో సహా వెళ్లాడు. అక్కడ వారిద్దరూ ఒక గదిలో విశ్రాంతి తీసుకున్నారు (Man Kills Wife).


ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ కత్తితో లిఖితను పొడిచాడు. అనంతరం తనను తాను గాయపరచుకున్నాడు. ఇంట్లోని వారు అక్కడకు వెళ్లే సరికి లిఖిత రక్తపు మడుగులో ఉంది. అప్పటికే ఆమె మరణించింది. తీవ్ర గాయాలపాలైన నవీన్‌ను బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం నవీన్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

Encounter: పోలీసులు వర్సెస్ గ్యాంగ్ స్టర్.. ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలు.. కేసు ఏంటంటే..


Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో సీరియల్ కిల్లర్.. ఏకంగా 9 మంది మహిళలను ఒకే మాదిరిగా ఏం చేశాడంటే..?


మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 09 , 2024 | 07:44 PM