Share News

Hyderabad: ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం..

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:45 AM

ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి(Lord Vinayaka) దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది. వరసగా 70ఏళ్ల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు.

Hyderabad: ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం..

హైదరాబాద్: ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి(Lord Vinayaka) దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది. వరసగా 70ఏళ్ల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు. అంత పెద్ద గణపతిని చూసి దర్శించుకునేందుకు భక్తులు వస్తుండడంతో ఒకరోజు ముందుగానే దర్శనానికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు.


ఈసారి సప్తముఖ శక్తి మహాగణపతిగా గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుణ్ని దర్శించుకునేందుకు రేపు(శనివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా వెళ్లనున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రేపు మధ్యాహ్నం 3గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరోవైపు 9రోజులపాటు నిర్వహించే ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్దఎత్తున చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు సహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

BRS: బీఆర్ఎస్‌లో విషాదం.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూత

KCR: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు

For Latest News click here

Updated Date - Sep 06 , 2024 | 10:45 AM