Share News

Balkampet Yellamma Talli: బల్కంపేట్ ఎల్లమ్మతల్లి కల్యాణ ఉత్సవాలు షురూ..

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:42 PM

జులై 9న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Talli) కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఇవాళ(సోమవారం) మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. ఇవాళ పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్.ఆర్.నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్దఎత్తున కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు.

Balkampet Yellamma Talli: బల్కంపేట్ ఎల్లమ్మతల్లి కల్యాణ ఉత్సవాలు షురూ..

హైదరాబాద్: జులై 9న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Talli) కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఇవాళ(సోమవారం) మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. ఇవాళ పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్.ఆర్.నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్దఎత్తున కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6గంటలకు పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. దీంతో కల్యాణ ఉత్సవాలు ముగుస్తాయి.


అయితే ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం హైదరాబాద్ ప్రధాన మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి 80ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులు అన్నీ మూసివేశారు. వాహనాల దారి మళ్లింపు జరుగుతోంది. ఈ ఆంక్షలు 10వ తేదీ రాత్రి 8గంటల వరకూ ఉంటాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా గమ్యస్థానాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. గతేడాది సుమారు 10లక్షలమంది కార్యక్రమానికి రావడంతో ఈసారి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు, భక్తులకు వసతులు సహా మరికొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇది కూడా చదవండి:

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..

Updated Date - Jul 08 , 2024 | 04:28 PM