Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఇలా ఇంట్లో అస్సలు పెట్టొద్దు.. డబ్బంతా పోతుంది..
ABN , Publish Date - Nov 08 , 2024 | 08:56 PM
Goddess Laxmi Devi: హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవిని సిరిసంపదలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు ప్రజలు. హిందువులందరూ తమ తమ ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన తమకు సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.
Goddess Laxmi Devi: హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవిని సిరిసంపదలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు ప్రజలు. హిందువులందరూ తమ తమ ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన తమకు సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. అందుకే.. నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. అయితే, అమ్మవారి ఫోటోను ఇంట్లో ఏర్పాటు చేసుకునే వారు కొన్ని విషయాలను తప్పక గమనించాలని సూచిస్తున్నారు అధ్యాత్మికవేత్తలు. మనం చూసిన చాలా వరకు ఫోటోలో లక్ష్మీదేవి కూర్చున్నట్లుగానే ఉంటుంది. కొన్ని ఫోటోల్లో మాత్రం నిల్చుని ఉంటుంది. మరి ఇంట్లో ఎలాంటి ఫోటోను పెట్టాలి.. ఎలాంటి ఫోటో పెడితే శ్రేయస్కరం.. అనేది ఈ కథనంలో చూద్దాం..
లక్ష్మీదేవికి సంబంధించిన మార్కెట్‌లో అనేక రకాల ఫోటోలు అందుబాటులో ఉంటాయి. అయితే, అన్ని విధాల ఫోటోలను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోకూడదని వేదపండితులు చెబుతున్నారు. అమ్మవారు కూర్చున్న ఫోటోను, విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా అమ్మవారు సంతోషించి.. సిరిసంపదలు కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇల్లు అయినా.. ఆఫీస్ అయినా లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలోనే ఉన్న ఫోటోలను పూజా స్థలంలో ఏర్పాటు చేయాలి. కూర్చున్న లక్ష్మీదేవిని పూజించడం వల్ల.. డబ్బు ఇంట్లో నిలకడగా ఉంటుందనడానికి చిహ్నంగా పేర్కొంటున్నారు పండితులు.
ఇలాంటి విగ్రహం, ఫోటో అస్సలు పెట్టొద్దు..
లక్ష్మీదేవి నిల్చున్నట్లుగా ఉండే ఫోటోను, విగ్రహాన్ని అస్సలు ఇంట్లో ఏర్పాటు చేయొద్దంటున్నారు పండితులు. ఇది అశుభంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఫోటో, విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన ఇంట్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మార్కెట్‌లో అమ్ముడవుతున్న లక్ష్మీదేవి ఫోటోలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. నిల్చున్నట్లుగా ఉన్న ఫోటోలు, ప్రతిమలు అస్సలు ఇంట్లో ఏర్పాటు చేయొద్దు. సాధారణంగానే.. లక్ష్మీదేవికి నిలకడ ఉండదంటారు. అందుకే.. నిల్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెడితే.. అమ్మవారు ఇంట్లో ఉండదని పండితులు చెబుతున్నారు. అందుకే.. ఇంట్లో, ఆఫీసుల్లో కూర్చున్న లక్ష్మీదేవిని ఆరాధించాలని సూచిస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను వేదపండితులు, వాస్తు నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.
Also Read:
ఇందులో దాక్కున్న హిప్పోను కనుక్కోండి చూద్దాం..
బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
For More Spiritual News and Telugu News..