Share News

CTET 2024 Admit Card : సీటెట్ హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:59 AM

CTET 2024 Admit Card : సీటెట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. జులై 7వ తేదీ నుంచి జరగనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET-2024) పరీక్షల కోసం అడ్మిట్ కార్డును సెంట్రలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విడుదల చేసింది.

CTET 2024 Admit Card : సీటెట్ హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
CTET 2024 Admit Card

CTET 2024 Admit Card : సీటెట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. జులై 7వ తేదీ నుంచి జరగనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET-2024) పరీక్షల కోసం అడ్మిట్ కార్డును సెంట్రలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విడుదల చేసింది. సీటెట్ జులై 2024 కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు.. తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ ctet.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


జులై 7 నుంచి సీటెట్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Also Read: ఇదొక వింత రెస్టారెంట్.. ప్లేట్‌లను వాడరు..


CTET అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

1. ముందుగా సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ను సందర్శించాలి.

2. CTET Admit Card 2024 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. ఆ తరువాత లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి.

4. ఆ తరువాత Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5. CTET అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై మీకు కనిపిస్తుంది.

6. దానిని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.

Also Read: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!


ఈ విషయంలో జాగ్రత్త..

👉 CTET 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసిన తరువాత అందులోని అంశాలన్నింటినీ పరిశీలించాలి.

👉 అభ్యర్థి పేరు: రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంట్రీ చేసిన మీ పూర్తి పేరు.

👉 రోల్ నంబర్: పరీక్ష కోసం ప్రత్యేక ఐడెంటిఫైయర్ నెంబర్.

👉 దరఖాస్తు సంఖ్య: మీ CTET దరఖాస్తు సమర్పణ సమయంలో రిజిస్ట్రర్ అయిన సంఖ్య.

👉 పుట్టిన తేదీ: అప్లికేషన్‌లో అందించిన విధంగా మీ పుట్టిన తేదీ.

👉 పరీక్ష తేదీ, సమయం: మీ పరీక్ష తేదీ, సమయం తప్పక చూసుకోవాలి.

👉 లింగం: మీ అప్లికేషన్‌లో నమోదు చేయబడిన మీ లింగం.

👉 వర్గం: అర్హత ప్రయోజనాల కోసం మీ వర్గం (జనరల్, SC, ST, OBC, మొదలైనవి).

👉 పేపర్ ఆప్షన్: మీరు CTET పరీక్షలో పేపర్ 1 లేదా పేపర్ 2 కోసం హాజరవుతున్నారా? అనేది చెక్ చేసుకోవాలి.

👉 పరీక్షా కేంద్రం: మీ పరీక్షా కేంద్రం చెక్ చేసుకోవాలి.

👉 మీడియం ఆఫ్ ఎగ్జామ్: మీరు పరీక్ష రాసే భాష.

👉 ఫోటో, సంతకం: గుర్తింపు కోసం మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్, డిజిటల్ సంతకం చెక్ చేసుకోవాలి.

👉 పరీక్షా మార్గదర్శకాలు: పరీక్ష రోజున అనుసరించాల్సిన నిర్దిష్ట సూచనలు, మార్గదర్శకాలు తప్పక చదవాలి. వాటిని అనుసరించడం ద్వారా పరీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బందిపడకుండా ఉంటారు.

For More Education News and Telugu News..

Updated Date - Jul 05 , 2024 | 11:59 AM