Share News

Lok Sabha Polls: ఆ రెండు నియోజకవర్గాలే టార్గెట్.. ప్రియాంకకు గెలుపు బాధ్యతలు..

ABN , Publish Date - May 07 , 2024 | 12:55 PM

దేశ ప్రధాని ఎవరుండాలనే ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటములు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాదంటే.. మాదంటూ ఎవరికి వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. యూపీలో మెజార్టీ సీట్లు గెలవాలి. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటితే ఆ పార్టీనే గెలుపునకు దగ్గరవుతుంది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అమేథి, రాయ్‌బరేలీ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Lok Sabha Polls: ఆ రెండు నియోజకవర్గాలే టార్గెట్.. ప్రియాంకకు గెలుపు బాధ్యతలు..
Rahul and Priyanka Gandhi

దేశ ప్రధాని ఎవరుండాలనే ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటములు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాదంటే.. మాదంటూ ఎవరికి వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. యూపీలో మెజార్టీ సీట్లు గెలవాలి. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటితే ఆ పార్టీనే గెలుపునకు దగ్గరవుతుంది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అమేథి, రాయ్‌బరేలీ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గాంధీ కుటుంబంతో సంబంధమున్న ఈ నియోజకవర్గాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు హస్తం పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!


ప్రియాంకకు గెలుపు బాధ్యతలు..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అమేథి, రాయ్‌బరేలీలో గెలుపు బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఐదో విడతలో భాగంగా మే 20న ఈ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో ప్రియాంకగాంధీ యూపీకి మకాం మార్చారు. 12 రోజుల పాటు ప్రియాంక గాంధీ అమేథి, రాయ్‌బరేలిలోనే ఉండనున్నారు. అమేథి, రాయ్‌బరేలీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పర్యటించి, ఓటర్లను ఓట్లు అభ్యర్థించాలని ప్రియాంక గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పార్టీకి విజయం దక్కుతుందని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ దాదాపు 20 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో రెండు నియోజకవర్గాల్లో దాదాపు 500 మంది విశ్వసనీయ కార్యకర్తలను కాంగ్రెస్ మోహరించింది.


కాంగ్రెస్ ప్లాన్ ఇదే..!

అమేథి, రాయ్‌బరేలీలో గెలవడం కోసం ప్రియాంకగాంధీ పూర్తిగా యూపీలోనే ఉండనున్నారు. ప్రతిరోజు ముఖ్య కార్యకర్తలతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో పాటు.. సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొవడమే లక్ష్యంగా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అమేథీలో అశోక్ గెహ్లాట్, రాయ్ బరేలీలో భూపేష్ బఘేల్ వంటి మాజీ ముఖ్యమంత్రుల అనుభవాన్ని ఉపయోగించనున్నారు. సీఎం స్థాయి వ్యక్తిని ఒక్కో నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. మరోవైపు రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఇవాళ నుంచి ప్రియాంక గాంధీ రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు.


రాహుల్‌ కోసం ప్రియాంక వ్యూహం

కేరళలోని వయనాడ్ కంటే రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీని ఎక్కువ ఓట్ల తేడాతో గెలిపించాలని ప్రియాంక గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో ఎక్కువ ఓట్ల తేడాతో గెలిస్తే వయనాడ్‌ని వదిలి వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి 4 లక్షల 30 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్ండగా.. దినేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనేది జూన్4న తేలనుంది.


PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest News and National News Here..

Updated Date - May 07 , 2024 | 12:55 PM