Lok Sabha Elections 2024: 4వ విడత ఎన్నికల్లో మహామహుల పోటీ.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
ABN , Publish Date - May 13 , 2024 | 07:02 AM
Lok Sahba Elections 4th Phase Polling: దేశ వ్యాప్తంగా10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలంగాణలోనూ నేడు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్‌లో 1 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Lok Sahba Elections 4th Phase Polling: దేశ వ్యాప్తంగా10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలంగాణలోనూ నేడు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్‌లో 1 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అయితే, నాలుగో విడత పోలింగ్‌లో దిగ్గజ నేతలు కంటెస్ట్ చేయడంతో పాటు.. మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. కీలక నేతల భవితవ్యం ఈ దశ ఎన్నికల్లో తేలనుంది. క్రికెట్ ప్రపంచ కప్ విజేతలు యూసుఫ్ పఠాన్, కీర్తి ఆజాద్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు ఈ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ దశలో బిజెపి, నోటా మధ్య ఆసక్తికరమైన పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది.
నాలుగో విడత ఎన్నికల్లో ఆసక్తికర అంశాలివే..
1. హై-ప్రొఫైల్ అభ్యర్థులు: ఈ దశలో అనేక మంది హై-ప్రొఫైల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా (కృష్ణానగర్, బెంగాల్). బీజేపీకి చెందిన నిర్మల్ కుమార్ సాహా, తృణమూల్ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన కుటుంబ కంచుకోట అయిన హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు.
2. పోటీలో అత్యంత ధనవంతుడు: తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ దశలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు. ఆయనకు రూ. 5,700 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఆ తరువాత రూ. 4,568 కోట్ల ఆస్తులతో తెలంగాణ నుంచి బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు.
3. బీజేపీ వర్సెస్ నోటా: ఇండోర్‌లో ఏప్రిల్ 29న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మే 13న పోలింగ్ రోజున నోటాకు ఓటు వేయాలంటూ ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థిస్తోంది. ఈ అభ్యర్థనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.
4. పోల్ పిచ్‌ను పరీక్షించడానికి సిద్ధంగా క్రికెటర్లు: 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియాలో భాగమైన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బర్ధమాన్-దుర్గాపూర్ నుండి పోటీ చేస్తున్నారు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్‌లోని బెహ్రంపూర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. వీరిద్దరినీ తృణమూల్ కాంగ్రెస్ రంగంలోకి దింపింది.
5. జమ్మూ కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల ఇది. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి రంగంలోకి దిగిన మాజీ మంత్రి అగా రుహుల్లా మెహదీతో PDP అభ్యర్థి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా తలపడనున్నారు. అప్నీ పార్టీకి చెందిన మహ్మద్ అష్రఫ్ మీర్ కూడా పోటీలో ఉన్నారు.
6. ఆంధ్ర, తెలంగాణాలో ఒకే దశలో పోలింగ్: ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.