Share News

Congress: రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్‌లో సస్పెన్స్

ABN , Publish Date - May 02 , 2024 | 10:28 AM

రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి.

Congress: రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్‌లో సస్పెన్స్

ఢిల్లీ: రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి. 2019లో రాయ్‌బరేలి నుంచి సోనియా గెలుపొందగా, అమేథి నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు.

Loksabha Polls 2024: ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా మద్యం పట్టివేత.. ఏయే ప్రాంతాల్లో అంటే?


అయితే ఈ సారి లోక్‌సభ ఎన్నికల నుంచి సోనియా గాంధీ తప్పుకున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేతలు యూపీని వదిలిపెడితే కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీని వదిలిపెట్టొద్దంటూ మిత్రపక్షాల నుంచి సైతం ఒత్తిడి తెస్తున్నారు. రాయ్‌బరేలి నుంచి ప్రియాంక గాంధీ, అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2వ దశ పోలింగ్‌లో వయనాడ్‌లో ఎన్నికలు ముగిశాయి.

Congress: ఓటేయకుంటే కరెంట్ కట్ చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హుకుం

Read Latest National News And Telugu News

Updated Date - May 02 , 2024 | 10:28 AM