Share News

Chandrababu Press Meet: నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:47 AM

ఏపీ అసెంబ్లీ ఎన్ని్కల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

Chandrababu Press Meet: నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు
Chandra Babu Naidu

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (AP Election Result) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ఉన్నత భవిష్యత్ కోసం పనిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘‘కూటమిని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం శాశ్వతం. రాజకీయాలు శాశ్వతం కాదు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అమెరికాలో ఉన్నవారు కూడా వచ్చి తపనతో ఓటు వేశారు. ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు కూడా వచ్చి ఓటు వేశారు. వైసీపీకి 39.35 శాతం పోలయ్యాయి’’ అని చంద్రబాబు అన్నారు.


పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక: చంద్రబాబు

‘‘మెజారిటీల్లో ఒకప్పుడు కుప్పం, సిద్ధిపేట పోటీపడుతుండేవి. ఇప్పుడు చరిత్రలో చూడని మెజారిటీ వచ్చింది. రాష్ట్రం బాగుపడాలని వచ్చి ఓటు వేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఊహించని విధంగా వచ్చాయి. పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఇంత చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకీ 45.6 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి. అవినీతి అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. మా కార్యకర్తల కంట్లో నిద్రలేని పరిస్థితి తెచ్చారు. మీడియా సహా రాష్ట్ర ప్రజలు అందరికీ కృతజ్ఞతలు’’ అని చంద్రబాబు అన్నారు.


శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: చంద్రబాబు

కూటమి ఘనవిజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ నా సుధీర్ఘ రాజకీయ యాత్రలో గడిచిన ఐదేళ్ల లాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే నా ధ్యేయం. మరింత బాధ్యతతో మనమంతా కలిసి పనిచేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.


భవిష్యత్ కోసం ముందుకెళ్లాం: చంద్రబాబు

‘‘భావితరాల భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇంత చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఉన్నవారు కూడా తపనతో వచ్చి ఓటు వేశారు. పక్క రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వాళ్లు కూడా రాష్ట్రం బాగుపడాలని వచ్చి ఓటు వేశారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది’’ అని చంద్రబాబు అన్నారు.


కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య విజయం: చంద్రబాబు

కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య విజయం అని చంద్రబాబు నాయుడు అభినందించారు. ‘‘మా కార్యకర్తల కంట్లో నిద్ర లేని పరిస్థితి తెచ్చారు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్‌ అనాలని హింసించారు. రాష్ట్రంలో పార్టీ కోసం ప్రాణాలు వదిలే పరిస్థితి చూశాం. కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య విజయం. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 45.6 శాతం, 39.37 శాతం వైసీపీకి ఓట్లు వచ్చాయి. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ’’ అని చంద్రబాబు అన్నారు.


మీడియాను కూడా ఐదేళ్లు ఇబ్బంది పెట్టారు: చంద్రబాబు

మీడియాను కూడా ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టారని నారా చంద్రబాబు అన్నారు. ‘‘ ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారు. అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారు. విశాఖకు వెళ్తే పవన్‌ను వెనక్కి పంపివేశారు. కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్టులు చేశారు. సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులు చేసి బెదిరించారు. నేను మిగులు విద్యుత్‌ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసింది. 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి భారం మోపారు. గడిచిన ఐదేళ్లలో 30 ఏళ్ల డ్యామేజ్‌ జరిగింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపిస్తాం: చంద్రబాబు

తాము పాలకులం కాదు.. సేవకులం అని నిరూపిస్తామని చంద్రబాబు అన్నారు. ‘‘ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్‌ పట్టుబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే పవన్‌ కృషి చేశారు. అందుకే కూటమిలో బీజేపీ భాగస్వామ్యమైంది. పొరపాట్లు లేకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. సమష్టి కృషితో విజయం సాధించగలిగాం’’ అని పేర్కొన్నారు.


నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు

తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయానని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. ‘‘ నాపై బాంబులతో దాడి చేసినప్పుడు కూడా బాధపడలేదు. మళ్లీ సీఎంగానే వస్తానని ఆనాడు అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశా. నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి ప్రజలు కూడా తోడ్పడ్డారు. నాపై నమ్మకం పెట్టుకున్న వారికి చక్కటిదారి చూపిస్తా’’ అని చంద్రబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

AP Election Result 2024: ఇంటిపేరు మార్చుకుంటున్నా: ముద్రగడ సంచలన ప్రకటన

Election Results: మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు

For more AP Election Result News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 11:46 AM