Share News

Diabetic: మధుమేహం షుగర్ పేషెంట్ల జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

ABN , Publish Date - Jun 13 , 2024 | 02:31 PM

నిజానికి మధుమేహం వచ్చినా సరైన చర్యలు తీసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కానీ సాధారణ వ్యక్తులను, మధుమేహం ఉన్నవారిని పోల్చి చూస్తే మధుమేహం ఉన్నవారి మీద దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారి జీవితం ఎలా ప్రబావితమవుతుందో..

Diabetic: మధుమేహం షుగర్ పేషెంట్ల జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

మధుమేహం ఒకప్పుడు పెద్దలకు మాత్రమే వచ్చే సమస్య. కానీ ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ సమస్య వస్తోంది. నిండా 30ఏళ్లు కూడా లేనివారు మధుమేహం సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మధుమేహం వచ్చినా సరైన చర్యలు తీసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కానీ సాధారణ వ్యక్తులను, మధుమేహం ఉన్నవారిని పోల్చి చూస్తే మధుమేహం ఉన్నవారి మీద దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారి జీవితం ఎలా ప్రబావితమవుతుందో.. వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే..

డయాబెటిస్ లో రెండు రకాలు పేర్కొంటారు. టైప్-1, టైప్-2 డయాబెటిస్ గా చెబుతుంటారు. టైప్-1 మధుమేహం ఉన్నవారి జీవితకాలం సగటు వ్యక్తుల జీవితకాలం కంటే 10-15 సంవత్సరాలు తక్కువగా ఉంటుందట.

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


టైప్-2 మధుమేహం ఉన్నవారు సాధారణ వ్యక్తులలా జీవితాన్ని గడపవచ్చు. జీవితకాలం కూడా సాధారణ వ్యక్తులతో సమానంగా ఉండవచ్చు. జీవనశైలి మార్పులు, మందులతో , ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇది సాధ్యమవుతుంది.

మధుమేహం ఉన్నవారిలో కేవలం చక్కెర స్థాయిలు మాత్రమే కాకుండా గుండె సంబంధ సమస్యల ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కూడా మధుమేహం ఉన్నవారి జీవితకాలం తగ్గడంలో ప్రభావం చూపిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచడం, రక్తపోటు ఎప్పుడూ ఎక్కువ కాకుండా చూసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చు. హృదయనాళ ఆరోగ్యం బాగుంటే గుండె జబ్బుల ప్రమాదం తక్కువ ఉన్నట్టే.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!


మధుమేహం ఉన్నవారు సమతుల ఆహారం మీద దృష్టి పెట్టకపోతే వారి జీవితకాలాన్ని వారే తగ్గించుకుంటున్నట్టు. ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితకాలాన్ని పొడిగిస్తాయి. సమతుల ఆహారం, వ్యాయామం పట్ల శ్రద్ద లేకపోతే జీవితకాలం తగ్గుతుంది.

మధుమేహం ఉన్నవారు తమ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. లేకపోతే చాలా తొందరగా జీవితకాలం ముగుస్తుంది.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 13 , 2024 | 02:31 PM