Share News

Diabetes Control: ఇవి తింటే క్షణాల్లో షుగర్ కంట్రోల్

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:40 PM

షుగర్.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం(Diabetes) వచ్చిందంటే చాలు.. తెగ హైరానా పడిపోయి ఆసుపత్రులకు పరిగెత్తుతుంటారు.

Diabetes Control: ఇవి తింటే క్షణాల్లో షుగర్ కంట్రోల్

ఇంటర్నెట్ డెస్క్: షుగర్.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మధుమేహం(Diabetes) వచ్చిందంటే చాలు.. తెగ హైరానా పడిపోయి ఆసుపత్రులకు పరిగెత్తుతుంటారు. అయితే ప్రకృతికి మనిషితో బంధం తెగిపోయినప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనేది సుస్పష్టం. షుగర్ వచ్చిన వారు తమ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే క్షణాల్లో కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.


బీన్స్, బఠానీ, తృణధాన్యాలను, పప్పులను ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇవి చెడు కొలస్ట్రాల్ తొలగించి, మంచి కొలస్ట్రాల్‌లను పెంచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయని వైద్యులు తెలిపారు. న్యూట్రియంట్స్ జర్నల్‌ అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల్ని నివారించడంలో పప్పు ధాన్యాలు చాలా ఉపయోగపడతాయి.


టైప్ 2 డయాబెటిస్ నియంత్రణతోపాటు, కార్డియోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పప్పులు, చిరుధాన్యాల్లో ఫైబర్, ఫోలేట్, పొటాషియంతో నిండిన ప్రొటీన్లు, జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. వీటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువ. అలా ఇవి మధుమేహ నియంత్రణలో తోడ్పడతాయి. కాబట్టి వీటిని నిత్యం తమ ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Andhrajyothy Journalism College: జర్నలిజం మీ కలా?.. అయితే మీకిదే మా ఆహ్వానం

For Latest News and National News click here

Updated Date - Jul 14 , 2024 | 03:41 PM