Share News

Diabetes: ఆనెలు వేధిస్తున్నాయా.. పొంచి ఉన్న షుగర్ ముప్పు!

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:35 PM

కాళ్లల్లో ఆనెలు(Foot corn) ఉంటే సూదులతో ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, మధుమేహం ఉన్నవారికి ఆనెలు వస్తాయి. ఆనెలున్న వారు బరువులెత్తుతుంటే ఆ బాధ వర్ణనాతీతం.

Diabetes: ఆనెలు వేధిస్తున్నాయా.. పొంచి ఉన్న షుగర్ ముప్పు!

ఇంటర్నెట్ డెస్క్: కాళ్లల్లో ఆనెలు(Foot corn) ఉంటే సూదులతో ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, మధుమేహం ఉన్నవారికి ఆనెలు వస్తాయి. ఆనెలున్న వారు బరువులెత్తుతుంటే ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఇవి మధుమేహానికి ముందస్తు సంకేతం కావొచ్చని అంటున్నారు వైద్యులు. డయాబెటిక్ పేషెంట్లను ఆనెల సమస్య వేధిస్తుంది. షుగర్ వ్యాధి లేని వారికి కూడా ఆనెలు వచ్చాయంటే భవిష్యత్తులో మధుమేహ ముప్పు పొంచి ఉందని వారు అంటున్నారు. ఆనెలు వచ్చాక పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో స్పర్శ మందగిస్తుంది. సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్‌కి దారి తీయవచ్చు.


మధుమేహ పేషెంట్లు ఏం చేయాలంటే..

ఆనెలు రాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ పాదాలపై శ్రద్ధ వహించాలి. బిగుతుగా ఉండే బూట్లకు దూరంగా ఉండాలి. పాదాలపై ఒత్తిడి తగ్గించడానికి మెత్తటి షూలను వాడాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించుకోవాలి. పాదాలను క్రమం తప్పకుండా కడగడం, చర్మం మృదువుగా మారడానికి లోషన్‌ను పూయాలి. గోళ్లను సరిగ్గా కత్తిరించాలి. ఆనెలు వస్తే వాటిని బ్లేడు‌తో కత్తిరించడం.. కెమికల్స్ వాడకూడదు. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్ మరింత పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ఆనెలతో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించడం మేలు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ తమ పాదాలలో వస్తున్న మార్పులను గమనించాలి. క్రమం తప్పకుండా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించాలి.


ఆయుర్వేదంలో..

ఆనెలను తగ్గించేందుకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలున్నాయి. వాటికి పిండ, మరీచ తైలాన్ని వేసి మర్దన చేయాలి. ఆనెలు పెరుగుతుంటే బ్లేడుతో కోస్తే ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. అలా చేయకూడదు. జిల్లేడు పాలకు పసుపు కలిపి ఆనెలకు పెట్టి ప్లాస్టర్‌తో కట్టేయాలి. ఇలా నాలుగైదు రోజులు చేస్తే ఆనెలు తగ్గిపోతాయి. ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో ఆనెలు ఉన్న ప్రాంతాన్ని కడగాలి. కలబంద గుజ్జు కూడా ఆనెలపై ప్రభావం చూపిస్తుంది. ఇలా ఆయుర్వేదం సాయంతోకూడా ఆనెలను తగ్గించుకోవచ్చు. కానీ, ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు చికిత్స విధానాలను ఆశ్రయించడం శ్రేయస్కరం.

For Latest News and Telangana News click here

Updated Date - Aug 21 , 2024 | 04:35 PM