Moringa: ఈ ఆకు పొడి రాస్తే చాలు.. జుట్టు నిగనిగలాడటం ఖాయం..!!
ABN , Publish Date - Jun 21 , 2024 | 01:43 PM
ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరుగుదలలో, ఆరోగ్యంగా ఉండటంలోనూ సహజసిద్ధమైన పద్ధతులు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో మునగ ఆకు ఒకటి. చాలా మంది మునగ చెట్టుకు కాసే మునక్కాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుని తింటారు. మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరుగుదలలో, ఆరోగ్యంగా ఉండటంలోనూ సహజసిద్ధమైన పద్ధతులు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో మునగ ఆకు ఒకటి. చాలా మంది మునగ చెట్టుకు కాసే మునక్కాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుని తింటారు. మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా మునగ ఆకులు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జుట్టు పెరుగుదలకు చక్కగా సహాయపడతాయి. జుట్టు పెరుగుదల కోసం మునగ ఆకు ఎలా వాడాలో తెలుసుకుందాం. పదండి.
సమృద్ధిగా యాంటి ఆక్సిడెంట్లు
మునగ ఆకులో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని పోషకాలకు పవర్‌హౌస్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది జుట్టు సంరక్షణకు ఉత్తమమైనది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడం, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంతో పాటూ ఇది జుట్టు మూలకాలను లోతుగా శుభ్రపరుస్తుంది. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. మునగాకు తాలింపు, పప్పు, కారం పొడితో పాటూ వివిధ రకాల వంటకాలను చేసుకుని ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాకుండా మునగాకును జుట్టు సంరక్షణలో కూడ ఉపయోగించవచ్చు. మునగాకు పొడిని హెయిర్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు లేదంటే తాజా మునగాకులను నీటిలో ఉడికించి దాన్ని గ్రైండ్ చేసి హెయిర్ ప్యాక్ గా వాడచ్చు. మునగాకును జుట్టుకోసం ఉపయోగిస్తే కలిగే లాభాలేంటంటే.
పుష్కలంగా
మునగాకులో జింక్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. తలలో సహజమైన ఆయిల్ గ్రంధులను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇది ఆరోగ్యవంతమైన, మెరిసే జుట్టుకు దారితీస్తుంది. మునగాకులో పేటరీగోస్పెర్మిన్ ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఇవి మన తలపై చుండ్రు, దురద, బాక్టీరియా బొబ్బలు, తామర, సోరియాసిస్ సమస్యలను దూరంగా ఉంచుతాయి.