Share News

Herbal Water: ఇంట్లోనే హెర్భల్ వాటర్ ఇలా తయారు చేసుకుని తాగండి.. చర్మం మెరిసిపోవడం ఖాయం..!

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:15 PM

నేటి కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరం లోపల కలుషితం అవుతుంది. దీని వల్లే చర్మం కాంతి తక్కువగా ఉండటం, మొటిమలు, మచ్చలు, గాయాలు తొందరగా నయం కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే హెర్బల్ వాటర్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల..

Herbal Water: ఇంట్లోనే  హెర్భల్ వాటర్ ఇలా తయారు చేసుకుని తాగండి.. చర్మం మెరిసిపోవడం ఖాయం..!
herbal water

శరీర ఆరోగ్యం చర్మం, జుట్టు, దంతాలు, గోళ్లు వంటి వాటిలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శరీరం లోపల ఆరోగ్యంగా ఉంటే చర్మం లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే నేటి కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరం లోపల కలుషితం అవుతుంది. దీని వల్లే చర్మం కాంతి తక్కువగా ఉండటం, మొటిమలు, మచ్చలు, గాయాలు తొందరగా నయం కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే హెర్బల్ వాటర్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం శుద్ది అవుతుంది. ఇది చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది. ఇంతకీ హెర్బల్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే..

కేవలం ఈ 9 అలవాట్లతో మీరు జెమ్ అయిపోతారు..!


హెర్బల్ వాటర్..

కావలసిన పదార్థాలు..

బీట్ రూట్..

ఆపిల్..

ఎండుద్రాక్ష..

సోపు గింజలు..

అల్లం..

ఒక గాజు కంటైనర్..

తయారీ విధానం..

పై పదార్థాలను అన్నింటిని ముక్కలుగా కట్ చేసి గాజు కంటైనర్ లో వెయ్యాలి. ఇందులో నీరు పోసి బాగా కలపాలి. దీన్ని సుమారు 3 నుండి 4 గంటల సేపు కదల్చకుండా అలాగే ఉంచాలి. పండ్లు, అల్లంలోని సారం అంతా నీటిలోకి వెళుతుంది. ఆ తరువాత ఈ నీటిని సాధారణంగా తాగవచ్చు. ఈ నీరు గొప్ప డిటాక్స్ డ్రింక్.

జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!


ఇవి కూడా బాగా పనిచేస్తాయ్..

పైన చెప్పుకున్న హెర్బల్ వాటర్ మాత్రమే కాదు.. చర్మాన్ని మెరుగుపరచడానికి మరిన్ని డిటాక్స్ డ్రింక్స్ ను కూడా ట్రై చేయవచ్చు..

  • కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. చర్మం మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో మంచి మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల చర్మంపై చికాకు తగ్గుతుంది.

  • దోసకాయ, పుదీనా నీరు కూడా మంచి డిటాక్స్ వాటర్. ఈ డ్రింక్ పూర్తి హైడ్రేటింగ్ గుణాలు కలిగి ఉండాలంటే, కట్ చేసిన దోసకాయ ముక్కలను ఒక బాటిల్ వాటర్‌లో వేసి కొంచెం పుదీనా కలపాలి. ఇది శరీరానికి రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది.

  • చర్మం అందంగా ఉండాలంటే క్యారెట్ జ్యూస్ కూడా తాగవచ్చు. క్యారెట్‌లో విటమిన్ సి, ఇ గుణాలు ఉంటాయి, ఇవి చర్మానికి మేలు చేస్తాయి. దీని వల్ల చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గుముఖం పడతాయి.

ఇవి కూడా చదవండి..

Thyroid: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ మూలికలు వాడి చూడండి..!


Soaked Walnuts: వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!


Hair Care: ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే.. తెల్లజుట్టు మాయమవుతుంది..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 05:19 PM