Share News

Mangoes: కాల్షియం కార్బైడ్ తో మాగిన మామిడి పండ్లను తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు చెప్పిన నిజాలివీ..!

ABN , Publish Date - May 21 , 2024 | 01:33 PM

వేసవి ఎంత బాధించినా మామిడి పండ్ల రుచి చూస్తే వేసవి బాధ మొత్తం మర్చిపోతారు. అయితే మార్కెట్లో సహజంగా మాగిన మామిడిపండ్ల కంటే కృత్రిమంగా మాగబెట్టిన మామిడిపండ్లు ఎక్కువగా అమ్ముతుంటారు. దీని కోసం కాల్షియం కార్భైడ్ వినియోగిస్తారు. అయితే కాల్షియం కార్బైడ్ వినియోగించి మామిడి పండ్లను మాగబెట్టడం, అలాంటి పండ్లను అమ్మడాన్ని భారతీయ ఆగ్రశ్రేణి ఆహార నియంత్రణ సంస్థ(FSSAI) నిషేదించింది.

Mangoes:  కాల్షియం కార్బైడ్ తో మాగిన మామిడి పండ్లను తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు చెప్పిన నిజాలివీ..!

మామిడిపండ్లు అంటే అందరికీ ఇష్టమే.. వేసవి ఎంత బాధించినా మామిడి పండ్ల రుచి చూస్తే వేసవి బాధ మొత్తం మర్చిపోతారు. అయితే మార్కెట్లో సహజంగా మాగిన మామిడిపండ్ల కంటే కృత్రిమంగా మాగబెట్టిన మామిడిపండ్లు ఎక్కువగా అమ్ముతుంటారు. దీని కోసం కాల్షియం కార్భైడ్ వినియోగిస్తారు. అయితే కాల్షియం కార్బైడ్ వినియోగించి మామిడి పండ్లను మాగబెట్టడం, అలాంటి పండ్లను అమ్మడాన్ని భారతీయ ఆగ్రశ్రేణి ఆహార నియంత్రణ సంస్థ(FSSAI) నిషేదించింది. అసలు కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టిన మామిడిపండ్లను తింటే ఏమవుతుంది? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే..

మామిడిపండు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, అనేక ఇతర సూక్ష్మపోషకాలు ఉంటాయి. కానీ మామిడిపండ్లను కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెడితే ఆరోగ్యానికి మేలు జగరడానికి బదులు కీడు జరిగే అవకాశాలు ఎక్కువ.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!


మామిడి వంటి పండ్ల పక్వం కోసం సాధారణంగా ఉపయోగించే కాల్షియం కార్బైడ్.. ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇందులో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఈ పదార్ధాలు శరీరంలోకి వెళితే మైకము, తరచుగా దాహం, చికాకు, బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు మింగడంలో ఇబ్బంది, వాంతులు, నోటి పూతలు వంటివి కూడా ఎదురవుతాయి. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండ్లను మాగబెడితే పండ్ల మీద ఆర్సెనిక్, భాస్వరం అవశేషాలు మిగిలిపోతాయి.

కాల్షియం కార్బైడ్ ద్వారా పండిన మామిడి పండ్లు తింటే దీర్ఘకాలిక హైపోక్సియాను ప్రేరేపిస్తుంది. ఇది నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, తల తిరగడం, అతి నిద్ర, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెర్రిబల్ ఎడెమా, కాళ్లు చేతులలో తిమ్మిరి, బలహీనత, రక్తపోటు తక్కువగా ఉండటం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మామిడి పండ్లు తినడానకి ఓ గంట ముందే వాటిని నీటిలో ఉంచడం ద్వారా వాటి మీద ఉన్న అవశేషాలు, రసాయనాల ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 21 , 2024 | 01:33 PM