Share News

Monsoon Health Tips: దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఇలా చేయండి..

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:07 PM

Monsoon Health Tips: ప్రతీ సీజన్‌లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి..

Monsoon Health Tips: దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఇలా చేయండి..
Monsoon Health Tips

Monsoon Health Tips: ప్రతీ సీజన్‌లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి అనారోగ్యానికి కారణమవుతాయి. చిన్న పిల్లలైనా.. పెద్దవారైనా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతుంటాయి. మెడిసిన్స్ వాడితే ఈ సమస్యలు తగ్గిపోతాయి. కానీ, పదే పదే మెడిసిన్స్ వాడటం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వర్షాకాలంలో మీరు కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇందుకోసం ఏళ్లుగా వంటింట్లో ఉపయోగించే కొన్ని వస్తువులతోనే చికిత్స పొందవచ్చు. పురాతన కాలం నుంచి మన పూర్వీకులు వినియోగిస్తున్న రెమెడీస్ ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి రెమిడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


వీటితో ఆవిరి పట్టాలి..

వర్షాకాలంలో గొంతునొప్పి, జలుబు, దగ్గు సమస్య వేధిస్తోందా? అయితే, తులసి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్కలను నీటిలో వేసి ఆవిరి పట్టాలి. ఇది చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఆవిరి పట్టడం వల్ల కఫం కరిగిపోతుంది. తులసి, దాల్చినచెక్క, లవంగాలు బ్యాక్టీరియా వ్యాప్తిని నివారిస్తాయి. ఆవిరి పట్టడం వల్ల ముక్కు, గొంతు వాపు తగ్గుతుంది.


కషాయం..

వర్షాకాలంలో జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లయితే.. లవంగం, అల్లం, తులసి ఆకుల కషాయాన్ని తాగడం మంచిది. దానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


పసుపు..

జలుబు రెండు మూడు రోజుల్లో నయమవుతుంది. కానీ దగ్గు ప్రారంభమైతే అది కనీసం ఒక వారం పాటు ఉంటుంది. ఈ దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది. పాలలో కూడా పసుపు మరిగించి తాగొచ్చు. దీని ద్వారా దగ్గు, జలుబు తగ్గుతాయి.


లవంగాలు..

విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే.. లవంగాలను ఉపయోగించొచ్చు. నోట్లో లవంగాలను వేసుకుని.. నమలకుండా అలాగే ఉంచుకోవాలి. ఆ రంగం మింగడం ద్వారా గొంతు నొప్పి, దగ్గు తగ్గుతుంది. వేడి నీటిలో లవంగాలు వేసి.. ఆవిరి పట్టాలి. ఒకవేళ మీకు విపరీతమైన దగ్గు ఉన్నట్లయితే.. 6 నుంచి 7 లవంగాలను తీసుకుని.. వాటి పువ్వులను వేరి తక్కువ మంటపై పాత్రలో వేయించాలి. నిద్రపోవడానికి ముందు దీనిని తినడం వల్ల రెండు, మూడు రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేద నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఈ సీజన్‌లో ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదరైతే.. వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.


Also Read:

BP: ఈ ఆహారాలతో జాగ్రత్త.. ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయ్..!

Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్

Jaggery tea vs sugar tea: చక్కెర టీ వర్సెస్ బెల్లం టీ.. ఏది బెటర్? నిపుణులు ఇచ్చిన క్లారిటీ

For More Health News and Telugu News..

Updated Date - Jul 28 , 2024 | 03:14 PM