Share News

Pears: వర్షాకాలంలో పియర్స్ పండ్లు ఎందుకు తినాలి? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:18 PM

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్లు, ఫైబర్, నీటి శాతం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పండ్లలో పియర్స్ పండ్ల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. పియర్స్ పండ్లను తెలుగులో..

Pears: వర్షాకాలంలో పియర్స్ పండ్లు ఎందుకు తినాలి? ఈ నిజాలు తెలిస్తే..!
pears fruit

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్లు, ఫైబర్, నీటి శాతం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పండ్లలో పియర్స్ పండ్ల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. పియర్స్ పండ్లను తెలుగులో బేరి పండ్లు లేదా సేపు కాయలు అని అంటుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని తినడం వల్ల లెక్క లేనన్ని లాభాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అసలు పియర్స్ పండ్లలో ఉండే పోషకాలేంటి? వీటిని వర్షాకలంలో తింటే కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

పోషకాలు..

పియర్స్ పండ్లలో ఫైబర్, విటమిన్లు, విటమిన్-కె, విటమిన్-సి, ఖనిజాలైన పొటాషియం, కాపర్ వంటివి అధికంగా ఉంటాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.

Mustard Seeds Vs Poppy Seeds: ఆవాలు, గసాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?



ప్రయోజనాలు..

  • వర్షాకాలంలో పియర్స్ పండ్లను తింటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. వీటిలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. విటమిన్-సి తెల్లరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే అంటువ్యాధుల ప్రమాదం నివారించడానికి పియర్స్ పండ్లు తినాలి.

  • పియర్స్ పండ్లలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ముఖ్యంగా ఉందులో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులోని ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలు ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • పియర్స్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

Leftover Chapati: రాత్రి మిగిలిపోయిన చపాతీలకు ఇంత పవర్ ఉందా? వీటిని తింటే ఏం జరుగుతుందంటే..!



  • విటమిన్-సి, విటమిన్-కె, కాపర్ తో సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లు పియర్స్ పండ్లలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

  • పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ పేగులోని బైల్ యాసిడ్స్ ను బంధించి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • పియర్స్ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, మధుమేహం సహా చాలా సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

Optical Illusion: మీ మెదడు పనితీరుకు ఇదే ఛాలెంజ్.. కాక్టస్ మొక్కల మధ్య దాగున్న 3 జంతువులను 10 సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..!



  • కేలరీలు తక్కువగా ఉండటం వల్ల పియర్స్ పండ్లు తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు పియర్స్ పండ్లు తింటే వీటిలో ఉండే అధిక ఫైబర్, అధిక నీటి కంటెంట్ కారణంగా ఎక్కువ సేపు ఆకలిని నియంత్రిస్తుంది.

  • విటమిన్-కె, బోరాన్, మెగ్నీషియంతో సహా ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పియర్స్ పండ్లలో ఉన్నాయి. ఇవి ఎముకల ఖనిజీకరణకు, బోలు ఎముకల వ్యాధి రాకుండా చేయడంలోనూ సహాయపడతాయి. వీటిలో బోరాన్ కాల్షియం గ్రహించడాన్ని పెంచుతుంది.

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 04:18 PM