Share News

Skin Care: ఈ డ్రింక్స్ లో ఏ ఒక్కటి తాగినా చాలు.. ముఖం మీద ముడుతలు మంత్రించినట్టు మాయమవుతాయి..!

ABN , Publish Date - Jul 12 , 2024 | 08:28 PM

ముఖ చర్మం అందంగా, ఆకర్షణగా, కాంతులీనుతూ యవ్వనంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ వయసు కారణంగానూ, జీవనశైలి కారణంగానూ చాలామంది చర్మ సమస్యలను, చర్మం మీద ముడుతలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టాలంటే..

Skin Care: ఈ డ్రింక్స్ లో ఏ ఒక్కటి తాగినా చాలు.. ముఖం మీద ముడుతలు మంత్రించినట్టు మాయమవుతాయి..!

ముఖ చర్మం అందంగా, ఆకర్షణగా, కాంతులీనుతూ యవ్వనంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ వయసు కారణంగానూ, జీవనశైలి కారణంగానూ చాలామంది చర్మ సమస్యలను, చర్మం మీద ముడుతలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టాలన్నా, చర్మం మీద ముడుతలు తగ్గించుకోవాలన్నా చర్మానికి మేలు చేసే డ్రింక్స్ తాగాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముడుతలు పోగొట్టి చర్మాన్ని యవ్వనంగా మార్చే ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుంటే..

ఉదయం పూట నల్ల ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వు కలిపిన నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. కేవలం చర్మానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది.

యాపిల్ తో పొరపాటున కూడా కలిపి తినకూడదని ఆహారాలు ఇవి..!


గోండ్ కటిరా లేదా గోధుమ బంక అనేది శరీర వేడిని తగ్గిస్తుంది. చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. మొటిమలు, తామర, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

మునగ ఆకుల రసం తాగడం వల్ల కూడా ముడతలు తగ్గుతాయి. మునగ ఆకుల రసం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే విటమిన్-సి పుష్కలంగా కలిగి ఉంటాయి.

అలోవెరా కూడా ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరాలో ఆక్సిన్ లు, గిబ్బరెల్లిన్ లు పుష్కలంగా ఉంటాయి. అలోవెరా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగుతూ ఉంటే తక్కువ సమయంలో మెరిసే చర్మం సొంతమవుతుంది.

క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగుతూ ఉంటే చర్మానికి చాలా మేలు చేస్తుంది. ముఖం మీద ముడతలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది.

ఈ 6 సమస్యలు ఉన్నవారు సొరకాయ పొరపాటున కూడా తినకూడదు..!

మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 12 , 2024 | 08:28 PM