Share News

Tea: మధుమేహం ఉన్నవారు టీ తాగడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలేంటంటే..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 06:26 PM

టీ భారతీయుల జీవనవిధానంలో భాగమైపోయింది. అన్నం లేకపోయినా ఓర్చుకునేవారు ఉంటారేమో కానీ టీ తాగకపోతే పనులు ముందుకు నడవవు చాలామందికి. అయితే టీ తాగడం మధుమేహం ఉన్నవారి ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది.

Tea: మధుమేహం ఉన్నవారు టీ తాగడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలేంటంటే..!

టీ భారతీయుల జీవనవిధానంలో భాగమైపోయింది. అన్నం లేకపోయినా ఓర్చుకునేవారు ఉంటారేమో కానీ టీ తాగకపోతే పనులు ముందుకు నడవవు చాలామందికి. అయితే టీ తాగడం మధుమేహం ఉన్నవారి ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. భారతీయులకు పాలతో చేసిన టీ తాగడమే అలవాటు. మధుమేహం ఉన్నవారు ఈ టీ తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

పాలు, చక్కెర రెండూ కలిస్తే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయి. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. చక్కెరలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే టీలో చక్కెరకు బదులుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు ఎంచుకోవాలి.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!


టీకు ఉపయోగించే పాలు, చక్కెర మొత్తాన్ని తగ్గించడం వల్ల రక్తంలో చక్కెర స్పైక్ లను నియంత్రించవచ్చు. ముఖ్యంగా పాలు, చక్కెర ఉపయోగించి కలిపి చేసే టీని అప్పుడప్పుడు తీసుకుంటే పర్లేదు. కానీ దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు.

మధుమేహం ఉన్నవారు పంచదార, పాలు కలిపిన టీని తీసుకున్నప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే విధానాన్ని, చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!


టీ మీద ఇష్టం ఉన్నవారు పంచదారకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను లేదా స్టెవియా వంటి సహజ ప్రయత్యామ్నాయాలను ఉపయోగించాలి. చక్కెరకు బదులుగా వీటిని వాడినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకపోవడం స్పష్టంగా గమనించవచ్చు.

టీ వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు పెరిగే అవకాశం ఉంటే రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లను తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!

ముఖం, చర్మం మీద ఈ లక్షణాలుంటే మూత్రపిండ సమస్యలు ఉన్నట్టే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 22 , 2024 | 06:26 PM