Share News

Walking: ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:30 AM

కొందరు బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. ఎంత నడిచినా సరైన ఫలితాలు లేవని నిరాశ పడుతుంటారు. అలాంటి వారు వాకింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. వీటి వల్ల కేలరీలు బర్న్ కావడం, తద్వారా బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.

Walking:  ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!
Walking Techniques

వాకింగ్ చాలా సులువుగా అందరూ చేయగల వ్యాయామం. సాధారణంగా ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వాకింగ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటారు. కొందరు మాత్రం బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. ఎంత నడిచినా సరైన ఫలితాలు లేవని నిరాశ పడుతుంటారు. అలాంటి వారు వాకింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. వీటి వల్ల కేలరీలు బర్న్ కావడం, తద్వారా బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. బరువు తగ్గించే వాకింగ్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుంటే..

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!


పవర్ వాకింగ్..

power walking

పవర్ వాకింగ్ పేరుకు తగ్గట్టుగానే పవర్పుల్ గా ఉంటుంది. కేలరీలను సులువుగా బర్న్ చేయడానికి ఇది ఉత్తమ టెక్నిక్. గుండె స్పందన రేటును పెంచుతూ చురుగ్గా నడవాలి. చేతులను బలంగా, వేగంగా ముందుకు వెనక్కు ఊపాలి. నడిచేటప్పుడు నిటారుగా ఉండాలి. ఈ వాకింగ్ వల్ల కేలరీలు బర్న్ కావడమే కాదు.. రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇంటర్వెల్ వాకింగ్..

walking2.jpg

ఇంటర్వెల్ వాకింగ్ అనేది వేగంగా నడవడానికి, నెమ్మదిగా నడవడానికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ చేసే వాకింగ్. ఇందులో 1 నిమిషం వేగంగా నడుస్తారు. ఆ తరువాత 2 నిమిషాలు వేగాన్ని తగ్గిస్తారు. ఇలా 20-30 నిమిషాలు వాకంగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ కావడం చాలా సులువుగా ఉంటుంది. మొత్తం ఫిట్‌నెస్ ను మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!


హిల్ వాకింగ్..

walking3.jpg

చదునైన నేలపైన నడవడం కంటే కాస్త ఎత్తుగా కొండ ప్రాంతంలా ఉన్న ప్రదేశంలో నడవడమే హిల్ వాకింగ్. ఈ వాకింగ్ కండరాలకు పని పెడుతుంది. బయట వాకింగ్ కు వెళ్లేవారు కొండ ప్రాంతంలా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నడవాలి. ఇక ఇంట్లో ట్రెడ్ మిల్ వాడేవారు ఇంక్లైన్ ఫీచర్ తో రూపొందిన ట్రెడ్ మిల్ ను ఉపయోగించాలి. ఈ వాకింగ్ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా కాళ్లను టోన్ చేస్తుంది.

బరువులతో నడవడం..

walking4.jpg

సాధారణంగా వాకింగ్ చేయడానికి, ఏదైనా బరువు పట్టుకుని నడవడానికి చాలా తేడా ఉంటుంది. బరువుగా ఉన్న దుస్తులు, లేదా తేలికపాటి వెయిట్స్ ను పట్టుకుని నడవడం వల్ల కేలరీలు బర్న్ కావడంలోనూ, కండరాలు బలంగా మారడంలోనూ సహాయపడుతుంది. అయితే చాలా ఎక్కువ బరువులను మాత్రం ఉపయోగించకూడదు.

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..!


వాకింగ్ లంగ్స్..

walking5.jpg

శరీర బలాన్ని పెంపొందించడానికి వాకింగ్ లంగ్స్ సహాయపడతాయి. ఒక కాలుతో పెద్ద అంగ వేసి మోకాలును వంచాలి. వెనుక కాలు మోకాలును వంచి మోకాలును నేలకు తగలకుండా కాస్త గ్యాప్ ఉండేలా చూడాలి. ఈ సమయంలో రెండు చేతులను నడుము దగ్గర ఉంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. కాళ్లు బలంగా మారుతాయి. శరీర దృఢత్వం పెరుగుతుంది.

వాకింగ్ గోల్స్..

  • వాకింగ్ ను ఫాలో అయ్యేవారు హైడ్రేటెడ్ గా ఉండాలి. నీరు బాగా తాగాలి. వాకింగ్ ముందు, వాకింగ్ కు తరువాత నీరు తాగాలి. అవసరం అయితే వాకింగ్ సమయంలో కొద్దిగా తాగవచ్చు.

Irregular Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా? ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..!



  • వాకింగ్ చేయడానికి, సౌకర్యవంతంగా ఉండటానికి మంచి షూస్ ధరించాలి. ఇది వాకింగ్ చేసేటప్పుడు గాయాలు కాకుండా, మోకాళ్ల నొప్పులు, ఇతర అసౌకర్యాలు కలగకుండా చేస్తుంది.

  • వాకింగ్ ను ట్రాక్ చేయడం మంచిది. రోజూ 30 నిమిషాలు నడవడం, ఎన్ని అడుగులు నడిచారో, ఎన్ని హార్ట్ పాయింట్స్ వచ్చాయో, ఎన్ని కేలరీలు బర్న్ అయ్యాయో ట్రాక్ చెయ్యాలి. ఇది వాకింగ్ ను మరింత మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.

  • రోజుకు ఖచ్చితంగా ఎన్ని నిమిషాలు నడవాలో గోల్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజూ ఒకే సమయానికి నడవడం అలవాటు చేసుకోవాలి. ఇతర పనులను సాకుగా చూపి వాకింగ్ ను ఎట్టి పరిస్థితులో స్కిప్ చేయకండి.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 23 , 2024 | 08:30 AM