Fire Accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు
ABN , Publish Date - Apr 27 , 2024 | 10:11 AM
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది. అయితే ఈ హోటల్లో సరసమైన ధరలకు గది వసతిని అందించేందుకు నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు మునిసిపాలిటీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే రియో గ్రాండే దో సుల్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం ప్రకారం ఈ హోటల్‌కు అవసరమైన లైసెన్స్ లేదని, తగిన అత్యవసర అగ్నిమాపక ప్రణాళిక లేదని అన్నారు.
మరోవైపు మంటల నుంచి(fire broke) రక్షించబడిన 13 మందిలో ఎనిమిది మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎందుకు అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయనే విషయం తెలియాల్సి ఉంది. పోర్టో అలెగ్రేలో మరో 22 చిన్న హోటళ్లను కలిగి ఉన్న గరోవా గ్రూప్‌లో ‘గరోవా ఫ్లోరెస్టా’ హోటల్ కూడా ఒక భాగం.
2022లో దానిలోని మరొక హోటల్లో కూడా మంటలు చెలరేగాయి. నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి 400 గదులను ఉపయోగించేందుకు 2020లో ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు సమీక్షించబడుతుందని, హోటల్ మొత్తం 22 యూనిట్లను తనిఖీ చేస్తామని అధికారులు అన్నారు.
ఇది కూడా చదవండి:
Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్
Read Latest International News and Telugu News