Share News

Attack on Trump: 9 మంది అధ్యక్షులు, అభ్యర్థులపై.. అమెరికా చరిత్రను మార్చిన కాల్పులు

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:19 PM

అమెరికా తుపాకీ సాధారణ పౌరులపైనే కాదు, అధ్యక్షులపైనా పేలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌ కాల్పులకు తెగబడ్డాడు. అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇప్పటి వరకు 9 మంది దేశాధినేతలు, అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులపై దుండగులు కాల్పులు జరిపారు.

Attack on Trump: 9 మంది అధ్యక్షులు, అభ్యర్థులపై.. అమెరికా చరిత్రను మార్చిన కాల్పులు

న్యూయార్క్: అమెరికా తుపాకీ సాధారణ పౌరులపైనే కాదు, అధ్యక్షులపైనా పేలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌ కాల్పులకు తెగబడ్డాడు. అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇప్పటి వరకు 9 మంది దేశాధినేతలు, అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులపై దుండగులు కాల్పులు జరిపారు. గతంలో పలువురు అధ్యక్షులు,మాజీలు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులపై కూడా దాడులు జరిగాయి. అమెరికాకు 1776లో అమెరికా స్వాతంత్ర్యం నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న కొన్ని కాల్పుల ఘటనలను చూద్దాం..

అబ్రహం లింకన్‌(అమెరికా తొలి అధ్యక్షుడు)

అమెరికా తొలి అధ్యక్షుడిపై 1865 ఏప్రిల్ 14న జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు లింకన్ తల వెనకభాగంలో తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నల్లజాతీయుల హక్కుల కోసం నిలబడినందుకే ఆయన్ని హత్య చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.


జేమ్స్‌ గార్ఫీల్డ్‌(అమెరికా 20వ అధ్యక్షుడు)

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే 1881 జులై 2 జేమ్స్ గార్ఫీల్డ్‌ని హత్య చేశారు. వాషింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో చార్లెస్‌ గిటౌ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆయన చాలా రోజులపాటు చికిత్స పొందుతూ సెప్టెంబర్‌లో ప్రాణాలు వదిలారు.

జాన్‌ ఎఫ్‌ కెన్నడీ(అమెరికా 35వ అధ్యక్షుడు)

1963 నవంబర్‌‌లో డల్లాస్‌ను సందర్శన సమయంలో జాన్‌ ఎఫ్‌ కెన్నడీపై కాల్పులు జరిగాయి. అధ్యక్షుడి కాన్వాయ్‌పై అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌తో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అధ్యక్షుడిని పార్క్‌ల్యాండ్‌ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా కారులోనే ప్రాణాలు కోల్పోయారు.

విలియం మెక్‌కిన్లే(అమెరికా 25వ అధ్యక్షుడు)

షేక్ ‌హ్యాండ్ ఇస్తున్న సమయంలో 1901 సెప్టెంబర్ 6న అప్పటి అధ్యక్షుడు మెక్‌కిన్లేను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్లు వెళ్లాయి. 7 రోజులపాటు మృత్యువుతో పోరాడి సెప్టెంబర్ 14న తుది శ్వాస విడిచారు. జేమ్స్ గార్ఫీల్డ్ మాదిరిగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే ప్రాణాలు కోల్పోయారు.


రోనాల్డ్ రీగన్(అమెరికా 40వ అధ్యక్షుడు)

మార్చి 30, 1981న వాషింగ్టన్‌లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై జాన్ హింక్లీ ఆరుసార్లు తుపాకీతో కాల్చాడు. ఆయనతోపాటు ఉన్న మరో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. అధ్యక్షుడు తీవ్రంగా గాయపడి శస్త్రచికిత్స ద్వారా కోలుకున్నారు. మిగిలిన ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

గెరాల్డ్ ఫోర్డ్ (అమెరికా 38వ అధ్యక్షుడు)

చార్లెస్ మాన్సన్ 1975 సెప్టెంబర్ 5న అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌లినెట్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఇతను అమెరికా చరిత్రలో మోస్ట్ వాంటెడ్ మహిళ హంతకులను సృష్టించాడు.

థియోడర్ రూజ్‌వెల్ట్(అమెరికా 26వ అధ్యక్షుడు)

అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రసంగిస్తుండగా అక్టోబరు 14, 1912న థియోడర్‌ని వుడ్రో విల్సన్ కాల్చాడు. అధ్యక్షుడిని తోటి సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Donald Trump: కాల్పులతో ట్రంప్‌‌నకు దండిగా పెరిగిన విజయావకాశాలు..! పోల్‌స్టర్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు


Read Latest International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 08:21 PM