Share News

సిరియాపై అమెరికా దాడులు

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:13 AM

ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.

సిరియాపై అమెరికా దాడులు

  • 37 మంది ఉగ్రవాదులు హతం

  • వీరికి ఆల్‌ఖైదా, ఐసిస్‌తో లింక్

బీరుట్‌, సెప్టెంబరు 29: ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది. వాయువ్య సిరియాలోని రెండు లక్ష్యాలపై దాడులు చేసి 37 మంది ఉగ్రవాదులను హతమార్చింది. వీరంతా ఐసిస్‌, ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్నవారిని అగ్ర రాజ్యం ఆదివారం ప్రకటించింది. హుర్రస్‌ అల్‌ దీన్‌ గ్రూప్‌నకు చెందిన సీనియర్‌ ఉగ్రవాది, మరో 8 మందిని మట్టుబెట్టే ఉద్దేశంతో అమెరికా దాడులకు దిగింది. కాగా, సిరియాపై ఈ నెల 16న కూడా ఓసారి దాడి చేసింది. స్థానిక నాయకులు సహా సెంట్రల్‌ సిరియాలోని 28 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీన్ని ఐసిస్‌ శిక్షణ స్థావరంగా పేర్కొంది. 2014 నాటి అంతర్యుద్ధం నుంచి సిరియాలో అమెరికా బలగాలు ఉన్నాయి. ప్రస్తుతం కొందరు కాంట్రాక్టర్లు సహా 900 మంది సిరియాలో ఉన్నారు. ఐసిస్‌ మళ్లీ పుంజుకోకుండా అడ్డుకోవడమే దీని వెనుక ఉద్దేశం.

Updated Date - Sep 30 , 2024 | 04:13 AM