Earthquake: ఇండోనేషియాలో భూకంపం
ABN , Publish Date - Jan 09 , 2024 | 07:39 AM
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ధృవీకరించింది.
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.18 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ధృవీకరించింది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో 4.75 అక్షాంశం, 126.38 రేఖాంశం వద్ద ఉన్నట్టు తేలింది. ఈ భూకంపం గురించి ఎన్సీఎస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు భూకంపం సంభవించింది. 80 కిలో మీటర్ల లోతులో 4.75 అక్షాంశం, 126.38 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉంది.’’ అని ఎక్స్‌లో చేసిన పోస్టులో ఎన్సీఎస్ తెలిపింది. కాగా గత వారం న్యూఇయర్ రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. కనీసం 100 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. హెకురికు ప్రాంతంలో 23 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జపాన్ దేశంలో గత 8 ఏళ్లలో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇదే కావడం గమనార్హం.