Share News

Gaza: స్కూల్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడి..

ABN , Publish Date - Aug 10 , 2024 | 11:06 AM

గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

Gaza: స్కూల్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడి..
Hundred People dead, Israeli Strike At Gaza School

గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

gaja-2.jpg

ఆశ్రయం.. అంతలోనే..

గాజా పాఠశాలల్లో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఆగస్ట్ 4వ తేదీన నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో 30 మంది చనిపోయారు. అంతకుముందు రోజు హమామా పాఠశాలపై జరిపిన దాడిలో 17 మంది మృతిచెందారు. గాజాలో భవనాలు, పాఠశాలల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఆ భవనాలను హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా మారుస్తుందని, అందులో ఉగ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతుంది. ఆ క్రమంలో భవనాలు, పాఠశాల బిల్డింగ్స్‌పై దాడులు చేస్తోంది.

gaja-3.jpg

ఏం జరిగిందంటే..?

గత ఏడాది అక్టోబర్‌లో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. తొలుత ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను మట్టుబెట్టింది. 250 మందిని బందీలుగా పట్టుకుంది. దాంతో ఇజ్రాయెల్ ప్రతీ దాడులు ప్రారంభించింది. గత 10 నెలల నుంచి గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 40 వేల మంది పాలస్తీనీయులు చనిపోయారు. గాజాలో పరిస్థితుల దృష్ట్యా కాల్పుల విరమణ కోసం పలుమార్లు చర్చలు జరిగాయి. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది.

Updated Date - Aug 10 , 2024 | 11:12 AM