Share News

Donald Trump: కాల్పులు ఎందుకు జరిగాయంటే..?

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:52 AM

ఆగంతకుడి కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల దాడి తర్వాత ట్రంప్‌కు ప్రజాధారణ భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Donald Trump: కాల్పులు ఎందుకు జరిగాయంటే..?
Donald Trump

ఆగంతకుడి కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) శనివారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల దాడి తర్వాత ట్రంప్‌కు ప్రజాధారణ భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలను మిచిగాన్ ప్రచార ర్యాలీలో ట్రంప్ ఖండించారు.


అలాంటిదేమి లేదు..!!

‘నా వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు కలుగదు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాడుపడతా. గతవారం నాపై కాల్పులు జరిగాయి. నేను అతివాదిని కాదు. ప్రాజెక్ట్ 2025 గురించి, అమలు చేసే విధానాల గురించి తోసిపుచ్చారు. ఆ అంశాన్ని నా ప్రత్యర్థులు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు వయసు పైబడింది. ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే 2029 వరకు ప్రజా సేవ చేయగలరా..? డెమోక్రటిక్ పార్టీకి అభ్యర్థి ఎవరో తెలియదు. బైడెన్ ప్రజల వద్దకెళ్లి ఓట్లను అడిగి, తీసుకున్నాడు. ప్రస్తుతం అభ్యర్థిని మార్చాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఇదే ప్రజాస్వామ్యం. చైనా అధ్యక్షుడు జి జినిపింగ్‌ గొప్ప నేత. 140 కోట్ల మందిని ఉక్కు పిడికిలితో నియంత్రించారు అని’ డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు.


కాల్పుల కలకలం..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ క్షణం తీరక లేకుండా ఉన్నారు. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ఓ ఆగంతకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల నుంచి ట్రంప్ రెప్పపాటులో తప్పించుకున్నారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది ట్రంప్‌ను చుట్టుముట్టారు. కాల్పులు జరిగిన ఆగంతకుడిపై కాల్పులు జరిపి, హతమార్చారు. ఆ తర్వాత ట్రంప్‌పై కాల్పుల ఘటన సంచలనంగా మారింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 07:52 AM