Share News

Iran Attacks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మొదలు.. అగ్ర దేశాల సపోర్ట్

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:01 AM

ఇరాన్(Iran) సైన్యం ఎట్టకేలకు దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌(Israel)పై దాడి(attack) చేయడం ప్రారంభించింది. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్థరాత్రి సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఒక బాలిక సహా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Iran Attacks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మొదలు.. అగ్ర దేశాల సపోర్ట్
Iran Attacks Israel

ఇరాన్(Iran) సైన్యం దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌(Israel)పై దాడి(attack) చేయడం ప్రారంభించింది. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్థరాత్రి సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఒక బాలిక సహా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ కొన్నింటిని పేల్చివేశారు. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేశారు.


ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇజ్రాయెల్‌(Israel)పై ఇరాన్ దాడులను ఖండించాయి. ఈ దాడి మధ్యప్రాచ్యాన్ని మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తామని వెల్లడించారు. ఆ క్రమంలో అమెరికా(america) సైన్యం కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది.

మరోవైపు భారత్(bharat) కూడా ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతున్న శత్రుత్వంపై మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపింది. తక్షణ తీవ్రతను తగ్గించాలని, సంయమనం పాటించాలని, హింస నుంచి వెనక్కి తగ్గాలని, దౌత్య మార్గానికి తిరిగి రావాలని పిలుపునిస్తున్నట్లు కోరింది. ఈ ప్రాంతంలోని మా రాయబార కార్యాలయాలు భారతీయ సమాజంతో సన్నిహితంగా ఉన్నాయని వెల్లడించింది.


ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్(iran) రాయబార కార్యాలయం సమీపంలో వైమానిక దాడులు జరుగగా అందులో ఇరాన్‌కు చెందిన ఇద్దరు టాప్ ఆర్మీ కమాండర్లు సహా 13 మంది చనిపోయారు. దీని తరువాత ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని హెచ్చరించి శనివారం రాత్రి నుంచి దాడులు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(benjamin netanyahu) టెల్ అవీవ్‌లో ఇరాన్ దాడిపై స్పందించారు. మేము ఏదైనా ముప్పు నుంచి మమ్మల్ని రక్షించుకుంటామని అన్నారు. మనం కలిసికట్టుగా నిలబడతామని, దేవుడి సహాయంతో శత్రువులందరినీ జయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి ఇజ్రాయెల్ బదులిచ్చేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు. దీంతోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు మధ్యాహ్నం KKR vs LSG మ్యాచ్..ఎవరు గెలుస్తారంటే


Ambedkar Jayanti: నేడు అంబేద్కర్ జయంతి..ఏం చదువుకున్నారు, వేటి కోసం పోరాడారు


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 09:08 AM