Share News

Kim Jong Un: నియంత చేతికి సూసైడ్ డ్రోన్స్.. నెక్ట్స్ ఏం చేయబోతున్నారంటే

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:19 PM

చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.

Kim Jong Un: నియంత చేతికి సూసైడ్ డ్రోన్స్.. నెక్ట్స్ ఏం చేయబోతున్నారంటే
Kim Jong Un

చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. సూసైడ్ డ్రోన్ రూపంలో వెరీ డేంజర్ ఆయుధం కిమ్ చేతికి వచ్చింది. ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ పరీక్షల్లో భాగంగా పంట పొలాల మధ్య ఉన్న యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తెలుపు రంగులో ఉన్న డ్రోన్ గాల్లోకి లేచి.. వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీకొట్టడం, ఆపై భారీ పేలుడు సంభవించడం తదితర ఘటనలకు సంబంధించిన ఫోటోలు ఈ వీడియోలో ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే చాలా దేశాల వద్ద ఉన్నప్పటికీ.. ఆ డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. ఈ సూసైడ్ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీ కొట్టిన తర్వాత పేలిపోతుంది. దీంతో అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను ఈ డ్రోన్లతో ఛేదించేలా వీటిని తయారుచేశారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా సూసైడ్ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారుచేసి సైన్యానికి అప్పగించాలని అధికారులను కిమ్ ఆదేశించారు.

Pakistan: పాక్ సాయుధుల ఘాతుకం.. వాహనాలను ఆపి 23 మందిని నిలువునా కాల్చేశారు


యుద్ధ సన్నద్ధత కోసం..

ఉత్తర కొరియా యుద్ధ సన్నద్ధతను మెరుగుపర్చుకోవడానికి సూసైడ్ డ్రోన్ల తయారీని వేగవంతం చేస్తామని కిమ్ సూసైడ్ డ్రోన్ పరీక్ష సందర్భంగా తెలిపారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా, అమెరికాకు ఎక్కువుగా అణ్వస్త్ర ప్రయోగ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో.. అమెరికా, సౌత్ కొరియా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంటూ సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న వేళ కిమ్ సూసైడ్ డ్రోన్ల ప్రయోగాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

Pakistan: బస్సు లోయలో పడి 29 మంది దుర్మరణం, ఒకేరోజు రెండు ప్రమాదాలు


ఆయుధాలు సిద్ధం..

యావత్‌ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌పై దృష్టి సారించిన తరుణంలో కిమ్‌ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికాలోని లక్ష్యాలను సైతం చేరుకునే దీర్ఘశ్రేణి క్షిపణులను రూపొందిస్తున్నారు. అదే సమయంలో పొరుగున ఉన్న దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకునే స్వల్పశ్రేణి ఆయుధాలను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనేదే కిమ్‌ లక్ష్యమని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా తమ దేశాన్ని అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని కిమ్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.


Israeli: తీవ్ర ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 03:22 PM